twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె స్పీడ్ తట్టుకోవడం కష్టం.. దడదడలాడించింది.. ధనుష్

    |

    విలక్షణ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ తాజా చిత్రం మారి2. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, సాయిపల్లవి కథానాయికలు. ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కానున్నది. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ వరలక్ష్మీ శరత్ కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ధనుష్ ఏమన్నారంటే..

    వరలక్ష్మీ చాలా స్పీడ్‌గా

    వరలక్ష్మీ చాలా స్పీడ్‌గా

    వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా స్పీడ్‌గా డైలాగ్స్‌ చెబుతూ దడదడలాడించింది. ఆమె వేగాన్ని తట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. నేను ఇంతవరకు అంత స్పీడ్‌గా డైలాగ్స్ చెప్పేవారితో నటించడం ఇదే మొదటిసారి.

    వరలక్ష్మీ వేగాన్ని తట్టుకోవడం

    వరలక్ష్మీ వేగాన్ని తట్టుకోవడం

    వరలక్ష్మీ విభిన్నమైన నటి. సెట్స్‌లో చాలా సహజంగా దూసుకెళ్తుంది. ఆమె వేగాన్ని నేనే కాదు.. ఎవరూ తట్టుకోలేరు. డైలాగ్స్ చెప్పడమే కాదు.. భావోద్వేగాలు పండించడంలో కూడా ఆమె దిట్ట. ఆమెతోపాటు డైలాగ్స్ చెప్పడం నాకు చాలా కష్టమైంది అని ధనుష్ పేర్కొన్నారు.

    స్కూల్‌లో అల్లు అర్జున్ పాటలకు డాన్స్.. హీరోయిన్లు అంతా శర్వానంద్ గురించి.. సాయి పల్లవి!స్కూల్‌లో అల్లు అర్జున్ పాటలకు డాన్స్.. హీరోయిన్లు అంతా శర్వానంద్ గురించి.. సాయి పల్లవి!

    సాయిపల్లవి మహిళా నేతగా

    సాయిపల్లవి మహిళా నేతగా

    మారి-2 చిత్రంలో సాయిపల్లవిది చాలా కీలకమైన పాత్ర. ఇప్పటికే సాయి పల్లవి పాత్ర క్రేజీగా మారింది. తమిళనాడు, కేరళలో ఆమె క్యారెక్టర్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. తప్పకుండా సినిమాకు సాయి పల్లవి స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది. ఇప్పటికే ఆమెను మహిళా నాయకురాలు అని పిలుస్తున్నారు. అంతేకాకుండా నటుడు రోబో శంకర్ కూడా సాయి పల్లవిని పొంబాలా తలా అని పిలవడం గమనార్హం.

    వారిద్దరూ లేకుంటే ఎలా

    వారిద్దరూ లేకుంటే ఎలా

    మారి-2 సినిమాలో రోబో శంకర్, వినోద్ పాత్రలు వెన్నుముక లాంటివి. షూటింగ్ సమయంలో వారిద్దరూ లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోలేను. వారిద్దరితో షూటింగ్ సరదాగా గడిచిపోయింది. వారి పాత్రలకు మంచి పేరు వస్తుంది అని ధనుష్ అన్నారు.

    21న మారి2 విడుదల

    21న మారి2 విడుదల

    మారి-2 చిత్రం తమిళ, తెలుగు భాషల్లో డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఆడియో భారీ విజయాన్ని అందుకొన్నది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజాకు ఈ సినిమా సక్సెస్ అందించింది.

    English summary
    Actor Dhanush feels that he found difficult to act with actress Varalaxmi Sarath Kumar. He said, "Varalaxmi's way of acting is totally different. I found it difficult to match her speed." Sai Pallavi is the female lead of the film. Her character 'Araathu Aanadhi' is already popular with the fans from both Tamil Nadu and Kerala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X