»   » రజినీకాంత్ అల్లుడు ఎవరి కొడుకు?? ధనుష్ పుట్టుక పై వివాదం ముదురుతోంది

రజినీకాంత్ అల్లుడు ఎవరి కొడుకు?? ధనుష్ పుట్టుక పై వివాదం ముదురుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనదైన టాలెంట్ తో ధనుష్ సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా తనకంటూ సొంతంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు తమిళ హీరో ధనుష్. ఇక ఎటూ సూపర్ స్టార్ అల్లుడన్న హోదా ఉండనే ఉంది. సిన్మాల్లో ఇప్పుదు దనుష్ తనదైన ఒక స్పెషల్ ముద్ర వేసుకున్నాడు అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ ధనుష్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఎంత క్రేజ్ ఉన్నా ఆన్ స్క్రీన్ ను మించిన ట్విస్ట్ ఒకటి ధనుష్ రియల్ లైఫ్ లో నడుస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అదేంటంటే.. రియల్ లైఫ్ లో ధనుష్ పెళ్లి సమయంలో ఓ వ్యక్తి ఈ హీరో తమ కొడుకని, మాకు అప్పగించాలని అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.దీనిపై అప్పుడు ధనుష్ ఫాదర్, డైరెక్టర్ కస్తూరిరాజా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి ఆ వివాదాన్ని పక్కకు జరిపారు. అయితే తర్వాత తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. అయితే అలా అనుకున్నారు. తాజాగా మళ్ళీ అదే వివాదం తెర మీదకొచ్చింది.

కస్తూరిరాజా

కస్తూరిరాజా

విజయలక్ష్మి దంపతులకు 1983లో జులై 28న ఎగ్మోర్‌లో జన్మించానని, సినిమాల్లోకి వచ్చాక తనపేరును ధనుష్‌‌గా మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో ధనుష్‌ పిటిషన్ లో పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు ఎవరో తనకు తెలుసు కాబట్తి ఆ కేసునుంచి తనను విముక్తున్ని చేయమంటూ తన పిటీషన్ లో చెప్పాడు ధనుష్.

ప్రయివేట్ బస్ కండక్టర్:

ప్రయివేట్ బస్ కండక్టర్:

మధురై జిల్లాలోని మలంపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రయివేట్ బస్ కండక్టర్ అయిన కదిరేశన్ (60) - మీనాళ్ (55) దంపతులు మేలూరు మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. ఈ దంపతులే హీరో ధనుష్ తమ కొడుకని, తన అసలు పేరు కలై సెల్వన్ అని, పదో తరగతి వరకు మేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని చెబుతున్నారు.

అసలు పేరు కలైసెల్వన్‌:

అసలు పేరు కలైసెల్వన్‌:

అంతేకాకుండా ధనుష్ ఇంటర్ అడ్మిషన్ శివగంగలో తీసుకున్నామని,అతని అసలు పేరు కలైసెల్వన్‌ కాగా చిన్నప్పుడు చదువుకోలేదని మందలించడంతో సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని అందులో పేర్కొన్నారు.

ఎవ‌రి కొడుకు? :

ఎవ‌రి కొడుకు? :

తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే కొడుకుతో కలిసి జీవించాలని తాము భావిస్తున్నామని, ధనుష్ తమ కుమారుడేనని చెప్పడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, కాదంటే డీఎన్ఏ పరీక్షలకు కూడా తాము సిద్ధమేనని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ అయి కూర్చుంది. అస‌లింత‌కీ ధ‌నుష్ ఎవ‌రి కొడుకు? అన్న‌ది కోర్టు తేల్చే పనిలో పడింది.

ప్రాథమిక విద్య నుంచి:

ప్రాథమిక విద్య నుంచి:

అందుకే ధనుష్‌ ఎవరి కుమారుడో తేల్చేందుకు ఆయన ప్రాథమిక విద్య నుంచి ప్లస్‌ టూ వరకు పుట్టుమచ్చల వివరాలున్న విద్యార్హత సర్టిఫికెట్లు దాఖలు చేయాలని మద్రాసు హైకోర్టు మదురైశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మదురై జిల్లా మేలూరు మలంపట్టి గ్రామానికి చెందిన కదిరేశన్ దంపతులు తమిళ హీరో ధనుష్‌ తమ కుమారుడేనని, ఆయన తమకు నెలకు రూ.65 వేలు ఆర్థికసాయం చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మదురై సమీపంలోని మేలూరు మేజిస్ట్రిట్‌ కోర్టులో కేసు దాఖలుచేశారు.

కేసును రద్దు చేయాలని కోరుతూ :

కేసును రద్దు చేయాలని కోరుతూ :

ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ ధనుష్‌ హైకోర్టు మదురై శాఖలో పిటిషన దాఖలుచేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జి.చొక్కలింగం సమక్షంలో ధనుష్‌ తరపు న్యాయవాది జీఆర్‌ స్వామినాథన్ హజరై వాదించారు. ధనుష్‌ తమ కుమారుడని నిరూపించే ఆధారాలేవి కదిరేశన్ దంపతులు న్యాయస్థానంలో దాఖలుచేయలేదని,

కేసును రద్దు చేయాలని:

కేసును రద్దు చేయాలని:

అందువల్ల మేలూరు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం ధనుష్‌ ప్రాథమిక విద్య నుంచి ప్లస్‌ టూ వరకు చదివిన సర్టిఫికెట్లను, అందులో పేర్కొన్న పుట్టుమచ్చల ఆధారాలను ఈ నెల 14వ తేదీలోపు ఇరువర్గాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
The elderly couple has approached the court seeking a monthly maintenance of Rs 65,000 from Dhanush
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu