twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: 'వై దిస్‌ కొలావరి డి'కి తెలుగు మూలం

    By Srikanya
    |

    ధనుష్ సూపర్ హిట్ సాంగ్ 'వై దిస్‌ కొలావరి డి'కి కి తెలుగు మూలం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాట గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలోనే ఉన్నట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ ల ద్వారా మీడియాలో పాపులర్ అవుతోంది. ఆ నాటకంలో ప్రధానపాత్ర అయ్యిన గిరీశం ఒకచోట...ఓ చోట పాటను ఎత్తుకుంటాడు...ఆ పాట తెలుగు ..ఇంగ్లీష్ కలిసినట్లుగా...ఇలా సాగుతుంది...నీ సైటు నా డిలైట్..నిన్ను మిన్న.. కాన్న కున్న.. క్వైటు రెచడ్ ప్లైట్..మూను లేని నైట్...ఫుల్లు మూను లైటటా...మూను కన్న మెల్ల కన్న... నీదు మోము బ్రైటటా...టా..టా..టా..అంటూ సాగుతుంది.. ఇలాగే కొలావరి డీ పాట కూడా (తమిళ్‌+ఇంగ్లీష్‌) లో వైట్‌ స్కిన్ను గరలు. గరలు హార్టు బ్లాకు... ఐసు ఐసు మీటు.. మై ఫ్యూచర్‌ డార్కు... వై దిస్‌ కొలావరి డి...ప..ప..ప..'' అంటూ సాగుతుంది..

    కాబట్టి ఈ పాటనుంచే ప్రేరణ పొంది ఆ పాటను రెడీ చేసికున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ పాట ధనుష్, శృతిహాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న త్రి చిత్రంలోది. ఈ పాట నేపధ్యంలోకి వస్తే...ఓ సాదాసీదా అబ్బాయి. ప్రేమలో పడ్డాడు. కొన్ని కారణాలవల్ల ప్రేమలో ఓడిపోయాడు. బాధలో ఒక పాట పాడతాడు. ఇక 'వై దిస్‌ కొలావరి డి' అంటే అర్ధం 'చంపెయ్యాలన్నంత కసి ఎందుకే!' అని. ఇంతకీ ఈ పాట...కన్యాశుల్కం నుంచే ప్రేరణ పొందాడంటారా...?

    English summary
    Dhanush's Super Hit song Why Dis Kolaveri Di song inspired from Gurajada's Kanya Sulkam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X