Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫిబ్రవరిలో వచ్చేస్తున్న 'లోకల్ బాయ్'.. ధనుష్ లేటెస్ట్ అప్డేట్
కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'మారి'లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. 'ధర్మయోగి'లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. సినిమాలో పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకోవడంలో ధనుష్ ముందుంటారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో చక్కటి సినిమాతో 'లోకల్ బాయ్'గా వస్తున్నారు.
ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా 'పటాస్'. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. స్నేహ మరో హీరోయిన్. 'అరవింద సమేత వీరరాఘవ', 'ఎవరు' సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.
ఈ సినిమాను తెలుగులో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ 'లోకల్ బాయ్'గా విడుదల చేస్తుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్టు సతీష్ కుమార్ తెలిపారు.
నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ "మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. తమిళంలో సంక్రాంతికి విడుదలై సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. ధనుష్ నటనకు మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా కోసం ఆయన మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు.
ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్... సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువ. తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'ధర్మ యోగి' తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది" అని అన్నారు.