షాకింగ్: అమలాపాల్ విడాకులకు ధనూషే కారణం.. సంచలన విషయాలు బయట పెట్టిన విజయ్ తండ్రి.!

By Manoj

Recommended Video

Reason Behind Amala Paul And Director AL Vijay Seperation

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ అమలా పాల్. అందంతో పాటు మంచి అభినయం కనబరిచే నటి కావడంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపిందామే. అయితే, వివాహం అయిన తర్వాత కొంత విరామం తీసుకుని మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అమలా పాల్ విడాకుల వెనుక అసలు కారణం స్టార్ హీరో రజినీకాంత్ అల్లుడు ధనూష్ అని ఓ న్యూస్ లీక్ అయింది. అది చెప్పింది మరెవరో కాదు.. విజయ్ తండ్రే. ఇంతకీ ఏంటా కథ.? వివరాల్లోకి వెళితే...

నాలుగు సినిమాలు ఒక్క హిట్ కూడా లేదు

నాలుగు సినిమాలు ఒక్క హిట్ కూడా లేదు

కేరళకు చెందిన అమలా పాల్ ‘నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. నాగ చైతన్య నటించిన ‘బెజవాడ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘నాయక్', బన్నీతో ‘ఇద్దరమ్మాయిలతో' నానితో ‘జెండాపై కపిరాజు' అనే సినిమాల్లో నటించింది. ఇవన్నీ నిరాశనే మిగిల్చాయి.

దర్శకుడితో ప్రేమాయణం.. పెళ్లి.. విడాకులు

దర్శకుడితో ప్రేమాయణం.. పెళ్లి.. విడాకులు

అమలా పాల్ కొన్నేళ్ల క్రితం తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం అటు అమల గానీ, ఇటు విజయ్ గానీ చెప్పలేదు. ఆ సమయంలో వీళ్ల విడాకులపై ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. అయినప్పటికీ క్లారిటీ మాత్రం రాలేదు.

 విడాకుల తర్వాత న్యూడ్ సీన్లతో సంచలనం

విడాకుల తర్వాత న్యూడ్ సీన్లతో సంచలనం

విజయ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత అమలా పాల్‌కు అవకాశాలు రావని అనుకున్నారు. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఆమె కొద్ది రోజుల క్రితం ‘అడై/ఆమె' అనే సినిమాలో నటించిన తీరే. ఇందులో అమలా పాల్ న్యూడ్‌గా నటించి షాకిచ్చింది. ఈ సినిమా హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది.

అమల - విజయ్ విడాకులకు ధనూషే కారణం

అమల - విజయ్ విడాకులకు ధనూషే కారణం

అమలా పాల్ - విజయ్ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఇప్పటి వరకు బయటకు రాకపోయినా.. ఆమె వివాహం తర్వాత సినిమాలు చేయడానికి సిద్దమవడమే ఈ పరిస్థితిని తీసుకొచ్చాయని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై విజయ్ తండ్రి అళగప్పన్ స్పందించారు. ఈ సందర్భంగా సినీ జంట విడాకులకు స్టార్ హీరో ధనూషే కారణమంటూ బాంబ్ పేల్చారు.

మాతో చెప్పకుండా ధనూష్‌తో మాట్లాడింది

మాతో చెప్పకుండా ధనూష్‌తో మాట్లాడింది

ఓ ఇంటర్వ్యూలో అళగప్పన్ మాట్లాడుతూ.. ‘అమల - విజయ్ విడాకులు తీసుకోడానికి ధనూషే కారణం. ఆయన తన సొంత బ్యానర్‌పై ‘అమ్మకనుక్క' అనే సినిమా తెరకెక్కించే సమయంలో అమలను హీరోయిన్‌గా అడిగాడు. పెళ్లి తర్వాత సినిమాలు చేయనని మాకు చెప్పిన ఆమె.. మాతో చెప్పకుండానే ఆ సినిమాకు ఓకే చెప్పింది. అదే విడాకులకు కారణం అయింది' అని తెలిపారు.

విజయ్ బ్రతిమాలినా అమల ఒప్పుకోలేదు

విజయ్ బ్రతిమాలినా అమల ఒప్పుకోలేదు

అలాగే, దీనిపై మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించారు. ‘ధనూష్ బ్యానర్‌లో సినిమా చేస్తుందన్న విషయం తెలిసిన తర్వాత విజయ్.. అమలను ఎంతగానో బ్రతిమాలాడు. అయినప్పటికీ ఆమె సినిమా చేయడానికే సిద్ధం అయింది. అంతేకాదు, విడాకులు తీసుకోడానికి కూడా ఆమె ముందుగా ప్రపోజల్‌ పెట్టింది' అని చెప్పుకొచ్చారాయన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X