ధనుష్‌ చిత్రం ప్రేమించాను నిన్నే

By Staff

రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌, శ్రీదేవి జంటగా తమిళంలో రూపుదిద్దుకున్న దేవతై కండేన్‌ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమాను ఎంఎస్‌ నాయుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రేమించాను నిన్నే అనే పేరు కింద ట్యాగ్‌లైన్‌గా ద పవర్‌ ఆఫ్‌ మెన్‌ అని పెట్టాం. డబ్బింగ్‌ ఇటీవలే ప్రారంభించాం. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఇదీ అదే తరహా చిత్రం. ప్రేమించే వయసుకు ఆస్తులు, అంతస్థులు, హోదాలు పట్టవు. ఓ సాధారణ స్థాయికి చెందిన యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ అతనికి అందినట్టే అంది చేజారిపోతుంది. ఊహించని ఆ పరిణామంతో యువకుడు ఎలా స్పందించాడన్నదే కథ. ఈ సినిమాలోని ఆరుపాటలను వెన్నెలకంటి, సాహితి, వనమాలి రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X