కొల‘వెర్రి’కి అభిషేక్ ఐస్..
దేశం మొత్తాన్ని ఊర్రూతలూగిస్తున్న ధనుష్ 'కొలవెరి' సాంగుకు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐసై పోయాడు. పాట అద్భుతంగా ఉందన్నారు. ధనుష్ నాకు అంత్యంత సన్నిహిత స్నేహితుడని, అతను రచించి, స్వయంగా పాడిన పాట ఇంత పెద్ద బంపర్ హిట్ కావడం ఎంతో ఆనందం ఉందని అభిషేక్ కొనియాడారు. నాకు కొలవెరి సాంగుకంటే కూడా ధనుష్ చాలా చాలా ఇష్టమని, ఆయన వండర్ ఫుల్ యాక్టర్ అంటూ తన మనసులోని మాటలు వెలుబుచ్చారు.
ధనుష్ తాను నటిస్తున్న '3' సినిమా కోసం కొలవెరి అనే సాంగును స్వయంగా రాయడంతో పాటు, పాడిన విషయం తెలిసిందే. ఈ పాట అశేష ప్రేక్షకాదరణ పొంది ఇండియాలోనే టాప్ పొజిషన్ కు చేరుకుంది. ఈ పాటలకు యూట్యూబ్ లో ఏకంగా కోటి 70 లక్షల హిట్స్ వచ్చి పడ్డాయి. దీంతో ఈ పాట యూట్యూబ్ గోల్డ్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఇది తమిళ సినిమా పాటే అయినా ఆలమెస్ట్ లిరిక్స్ అన్నీ ఇంగ్లీష్ లో ఉండటంతో భారత్ లోని అన్ని రాష్ట్రాల ప్రజలు భాషా బేధం లేకుండా కొలవెరి పాటపై వెర్రెక్కిన అభమానం ప్రదర్శిస్తున్నారు.
'3' సినిమా ద్వారా ధనుష్ సతీమణి ఐశ్వర్య దర్వకురాలిగా పరిచయం అవుతోంది. పాటనే ఈ రేంజ్ లో హిట్టయిందంటే...ఇక సినిమా ఏం రేంజ్ లో హిట్టవుతుందో? అని సినీ విశ్లేషకులు అంచానాలు వేయడంలో తడబడుతున్నారు.


Click it and Unblock the Notifications











