పెద్ద బ్యానర్ నుంచి రీమేక్ (‘రఘువరన్ బీటెక్’ ప్రివ్యూ)
హైదరాబాద్ : హిట్టైన తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ లేదా డబ్బింగ్ గా రావటం కొత్తేమీ కాదు. తాజాగా మరో చిత్రం అలా డబ్బింగ్ అయ్యి తెలుగులోకి వస్తోంది. అయితే ఎవరో ఊరూ పేరు లేని బ్యానర్ కాకుండా...తెలుగులో పెద్ద పేరున్న,సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన స్రవంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రం విడుదల అవుతూండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.తమిళంలోనూ ఈ చిత్రం మంచి హిట్ అయ్యింది. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వీఐపీ' తెలుగులో ‘రఘువరన్ బీటెక్'గా విడుదల కానుంది.
బీటెక్ డిగ్రీ పట్టా పొందిన ఓ నిరుద్యోగ యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా తెరకెక్కిన చిత్రం రఘువరన్ బీటెక్ తమిళ చిత్రం వేలై ఇల్లా పట్టాధారికి అనువాదం ఇది. ఆత్మైస్థెర్యంతో ముందడుగు వేస్తే ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏది ఉండదని చాటి చెప్పిన ఓ నిరుద్యోగ యువకుడి కథే ఈ చిత్ర ఇతివృత్తం. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి.

నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ ‘‘డిగ్రీ తీసుకున్న ఓ నిరుద్యోగ యువకుడి జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగాయి? అనేది సినిమా ప్రధాన ఇతివృత్తం. వేల్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమాను వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మించారు. తమిళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఉన్న కథ కావడంతో ఈసినిమాని ఇక్కడ విడుదల చేస్తున్నాం. ఈసినిమాకి ప్రధాన బలం కథ, ధనుష్ నటన. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అనిరుద్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి '' అని అన్నారు.
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
నటీనటులు ధనుష్, అమలాపాల్, వివేక్, శరణ్య, సముద్రఖని, సురభి, సెల్ మురగన్ తదితరులు
మాటలు: కిశోర్ తిరుమల,
సంగీతం: అనిరుద్,
ఎడిటర్: ఎమ్.వి.రాజేష్ కుమార్
పాటలు: రామజోగయ్యశాస్త్రి,
రచన, కెమెరా, దర్శకత్వం: ఆర్. వేల్‌రాజ్.
సమర్పణ: కృష్ణచైతన్య
విడుదల తేదీ: 01-01-2015.


Click it and Unblock the Notifications











