»   » తెలుగంటే ఇంత చిన్న చూపా? రైలొచ్చింది... కీర్తీ సురేష్ తప్ప ధనుష్ రాలేదు.... ఎవరొచ్చారో తెలుసా..?

తెలుగంటే ఇంత చిన్న చూపా? రైలొచ్చింది... కీర్తీ సురేష్ తప్ప ధనుష్ రాలేదు.... ఎవరొచ్చారో తెలుసా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్న కథా చిత్రాల దర్శకుడు ప్రభు సాల్మన్ "నైవైలీ నుంచి ఘజియాబాద్ కు వెళ్లేందుకు పట్టిన రెండు రోజులు, ఒక రాత్రిప్రయాణంలో నాకెదురైన అనుభవాలే "తొడరి" అంటూ సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే కదా..! ధనుష్ హీరోగా, మళయాలీ పిల్ల కీర్తీ సురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా రానుంది.

'కదులుతున్న రైలులో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలంటేనే చాలా కష్టం. అటువంటి ఒక సినిమా మొత్తాన్ని రైలులోనే తీయడం మాటలు కాదు. ఈ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడలేదనే చెబుతాను. ఎందుకంటే ఆ కష్టమంతా దర్శకుడు ప్రభుసాల్మన్ భరించారు. ఈ చిత్రంలో నాకంటే కీర్తి పాత్రే పెద్దది. ఆ రోల్‌లో ఆమె అద్భుతంగా నటించింది" అంటూ ఎప్పుడు చాన్స్ దొరికినా చెప్తూనే ఉన్నాడు ధనుష్.

సినిమా ట్రైలర్ మాత్రం అద్బుతంగా ఉంది. మహిళా తీవ్రవాదిగా కీర్తి సురేష్ పాత్ర ఉంటే, ప్యాంట్రీ ఉద్యోగిగా ధనుష్ కనిపిస్తాడు.. ప్రస్తుతం ఈ భామ ధనుష్ తో కలిసి నటించిన తొడరి రిలీజ్ కి రెడీ అయింది. దీన్ని తెలుగులో "రైల్" అనే పేరుతో డబ్బింగ్ చేయగా.. రీసెంట్ గా రైల్ ఆడియో ఫంక్షన్ జరిగింది.ఈ నెల 16 న థియేటర్ల లోకి రానున్న రైల్ వేడుకకు హీరోయన్ కీర్తి సురేష్ హాజరైంది. అయితే వేడుక బాగానే జరిగినా ధనుష్ మాత్రం రాలేదు. మొదటినుంచీ తెలుగు ఇండస్ట్రీ అంటే ధనుష్ కి కాస్త చిన్న చూపు ఉందనే మాత నిజం. ఈ సారి కూడా అదే కారణమా..?? అని కొందరు చెవులు కొరుక్కున్నారట. ఆ ఫొటోలూ "రైల్" సినిమా విగురించి మరికొన్ని విశేషాలు స్లైడ్ షోలో...

తొడరి తెలుగు వెర్షన్

తొడరి తెలుగు వెర్షన్

సూపర్ స్టార్ అల్లుడు ధనుష్, కీర్తీ సురేష్ జంటగా రూపొందిన సినిమా "తొడరి". ఈ సినిమా తెలుగు వెర్షన్ రైల్ ఆడియో రిలీజ్ నిన్న జరిగింది.

సొంత అనుభవం అట

సొంత అనుభవం అట

ఈ చిత్రం దర్శకుడు ప్రభు సాల్మన్ స్వీయానుభవం అట. ఒకసారి ఆయన నైవేలి నుంచి ఘజియాబాద్ కి రెండు రోజుల పాటు ప్రయాణం చేశాడట. ఆ సమయంలో తనకి ఎదురైన సంఘటనలు .. పరిచయమైన వ్యక్తులు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారట. ఆ సంఘటనల సమాహారంగానే ఈ కథను రెడీ చేసి తెరకెక్కించడం జరిగిందని చెప్పాడు.

కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది

కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది

ధనుష్ కి జతగా కీర్తి సురేష్ మొదటిసారి నటిస్తోంది. వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందనీ. సినిమాకి ఈ జంట మధ్య సాగే ప్రేమకథ మంచి ప్లస్ కానుందనీ టాక్.

 తెలుగంటే ఇంత చిన్న చూపా? రైలొచ్చింది... కీర్తీ సురేష్ తప్ప ధనుష్ రాలేదు.... ఎవరొచ్చారో తెలుసా..?

తెలుగంటే ఇంత చిన్న చూపా? రైలొచ్చింది... కీర్తీ సురేష్ తప్ప ధనుష్ రాలేదు.... ఎవరొచ్చారో తెలుసా..?

కీర్తి సురేష్" మలయాళీ కుట్టి కీర్తి సురేష్ బాగా ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అనే సంగతి ఒప్పుకోవాల్సిందే. ఎనర్జిటిక్ హీరో రామ్ పక్కన చేసినా... తన మార్క్ యాక్టింగ్ తో బాగా అట్రాక్ట్ చేసింది.

కొంచెం బొద్దుగా: అయితే..

కొంచెం బొద్దుగా: అయితే..

అమ్మడు కొంచెం బొద్దుగా ఉండడంతో ఈ భామకు టాలీవుడ్ నుంచి వెంటనే పిలుపు రాలేదు. కానీ బొద్దు భామలను బాగా ఎంకరేజ్ చేసే కోలీవుడ్ జనాలు మాత్రం కీర్తిని బాగానే ఆదరించారు.

ఆడియో ఫంక్షన్ జరిగింది

ఆడియో ఫంక్షన్ జరిగింది

ప్రస్తుతం ఈ భామ ధనుష్ తో కలిసి నటించిన తొడరి రిలీజ్ కి రెడీ అయింది. దీన్ని తెలుగులో రైల్ అనే పేరుతో డబ్బింగ్ చేయగా.. రీసెంట్ గా రైల్ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు హీరోయన్ కీర్తి సురేష్ హాజరైంది. వైట్ అండ్ వైట్ భలే మెరిసిపోయింది ఈ భామ.

కీర్తినే స్పెషల్ అట్రాక్షన్

కీర్తినే స్పెషల్ అట్రాక్షన్

ఫంక్షన్ లో కీర్తినే స్పెషల్ అట్రాక్షన్. అబ్జర్వ్ చేస్తే.. నేను శైలజ చిత్రంలో కనిపించిన పర్సనాలిటీకి.. ఇప్పటి కీర్తికి బాగానే డిఫరెన్స్ కనిపిస్తుంది.

బాగానే కాన్సంట్రేట్ చేసినట్లుంది

బాగానే కాన్సంట్రేట్ చేసినట్లుంది

తన సైజ్ పై వచ్చిన విమర్శలపై అమ్మడు బాగానే కాన్సంట్రేట్ చేసినట్లుంది. అందుకే కాసింత చిక్కిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా వైట్ అండ్ వైట్ లో ఏంజెల్ ని తలపించేసింది ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ.

English summary
"Rail" movie makers are going to launched the audio on 3rd September., and the movie is set to hit the theaters on 16th September.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu