ఈ ట్రైలర్ కూడా కేకే (వీడియో)

By Srikanya

ముంబై : ధనుష్, అమితాబ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'షమితాబ్'. ఈ చిత్రం ట్రైలర్ ఒకటి ఆల్రెడీ అఫీషియల్ గా విడుదల చేసి ప్రసంసంలు పొందారు. ఇప్పుడు ఈ చిత్రం ఆడియో విడుదల చేసి మరో ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ సైతం ఇప్పుడు అటు బాలీవుడ్ లో ఇటు తమిళనాట సంచలనం క్రియేట్ చేస్తోంది. టీజర్ చూసిన వారంతా ప్రసంశల్లో ముంచెత్తుతున్నారు. హిట్ గ్యారెంటీ అంటున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమాతో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర కూడా బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వందలాది మొబైల్ కెమెరాలు తమ చుట్టూ ఉంటాయని, అలాంటప్పుడు వాటినుంచి ఈ గెటప్ ను కాపాడటం చాలా కష్టమని బచ్చన్ తన బ్లాగులో కూడా రాశారు. షమితాబ్ సినిమాకు ఆర్ బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే ఈ చిత్రం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన గళాన్ని విప్పారు. తన కొత్త చిత్రం షమితాబ్ కోసం ఆయన ఓ గీతాన్ని ఆలపించారు. ఆర్. బాల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇటీవలే ఈ గీతాన్ని అమితాబ్ ముంబాయిలోని ఆదేష్ స్టూడియోలో ఆలపించినట్లు సమాచారం. దీనిని గురించి సామాజిక అనుసంధాన వేదిక అయిన ట్విట్టర్‌లో అమితాబ్ సందేశాన్నిచ్చారు.

అమితాబ్ ఆలపించిన పాట శ్రోతలను బాగా అలరిస్తోంది. డిసెంబర్ 30న యూ ట్యూబ్ లో విడుదలైన ఈ పాట ఇప్పటికే 413,822 క్లిక్స్ తో దూసుకుపోతోంది. సినిమా పబ్లిసిటీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ మద్యనే విడుదల చేసిన ఆడియో ట్రైలర్ కూడా ఇందులో బాగమే. ఇదే మొట్ట మొదటి ఆడియో ట్రైలర్ కావటం గమనార్హం.

పాట గురించి అమితాబ్ మాట్లాడుతూ...అవధేష్ శ్రీవాస్తవతో కలిసి ఆయన మ్యూజిక్ స్టూడియోలో రాత్రి చాలా సేపు కూర్చున్నానని, షమితాబ్ సినిమా కోసం మరోసారి తాను పాట పాడుతున్నానని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చిన అద్భుతమైన బాణీలకు తాను పాడానని ఆయన రాశారు.

ఇళయరాజా సంగీత ప్రపంచంలో ప్రవేశించి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా, ఇప్పటికీ ఆయన స్వరాలు మాత్రం సరికొత్తగానే ఉంటాయని, ఆయన ప్రాధాన్యం అలాగే కొనసాగుతోందని అమితాబ్ చెప్పారు. చాలామంది సుప్రసిద్ధ సంగీతదర్శకులను ఆయన తయారుచేశారని, దాదాపు 900కు పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారని ప్రశంసల జల్లు కురిపించారు.

 Dhanush's and amithab Shamitabh Trailer

చాలా ఏళ్లు గడిచినా ఇళయరాజా గారి స్వరాలలో మాధుర్యం మాత్రం అలాగే వుంది. ఆయన సంగీతాన్ని సమకూరుస్తున్న చిత్రంలో మరోసారి పాట పాడే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను అని అమితాబ్ తెలిపారు. గతంలో ఇళయరాజా స్వరాలను అందించిన చీనికమ్ పా చిత్రాల్లోను అమితాబ్ తన గొంతును వినిపించారు.

షమితాబ్ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు తమిళ నటుడు ధనుష్, కమల్ హాసన్ తనయ అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు. గోవా, తమిళనాడులలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X