Dhanush with Shekhar Kammula. తొలిసారి అలాంటి కథతో... ప్యాన్ ఇండియా మూవీగా

కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. దీంతో టాలీవుడ్ స్టామినా గురించి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో మన హీరోలతో సినిమాలు చేయడానికి పలు పరిశ్రమలకు చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. అదే సమయంలో మన దర్శకులతో సినిమాలు చేయడానికి హీరోలు సైతం ముందుకొస్తున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ఓకే అయిపోయాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్, కోలీవుడ్ హీరో కాంబోలో ఓ సినిమా ప్రకటన వెలువడింది. ఆ వివరాలు మీకోసం!

తెలుగు దర్శకుల కోసం హీరోలు క్యూ

తెలుగు దర్శకుల కోసం హీరోలు క్యూ

తెలుగు దర్శకుల్లో చాలా మంది పాన్ ఇండియా రేంజ్ వాళ్లే ఉన్నారు. అందుకే మన డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి వేరే ఇండస్ట్రీలకు చెందిన హీరోలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో మన దర్శకులు పలు సినిమాలను తెరకెక్కించి మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే, ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. దీంతో మనోళ్ల టాలెంట్ దేశం మొత్తం తెలుస్తోంది.

 కోలీవుడ్ స్టార్ హీరోలంతా వస్తున్నారు

కోలీవుడ్ స్టార్ హీరోలంతా వస్తున్నారు

మరీ ముఖ్యంగా తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి కోలీవుడ్ స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఇళయదళపతి విజయ్.. వంశీ పైడిపల్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే, మాస్ హీరో సూర్య కూడా బోయపాటి శ్రీనుతో మూవీ చేయబోతున్నాడు. వీళ్లతో పాటు చిన్న చిన్న హీరోలు కూడా టాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో చర్చలు జరుపుతున్నారు.

మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందిగా

మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందిగా

తాజాగా టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును దక్కించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్‌తో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరొందిన శేఖర్ కమ్ముల సినిమాను చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. ఎస్వీసీఎల్ఎల్పీ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది

అదిరిపోయే కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. ఈ మేరకు తాజాగా వచ్చిన ప్రకటనలో ఇది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందనున్నట్లు వెల్లడించారు. తమిళంలో స్టార్‌గా వెలుగొందుతోన్న ధనూష్‌కు తెలుగు, హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.

తొలిసారి అలాంటి కథతో వస్తున్నాడు

తొలిసారి అలాంటి కథతో వస్తున్నాడు

శేఖర్ కమ్ముల ఇప్పటి వరకూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే, ధనూష్ అన్ని రకాల చిత్రాలు చేశాడు. ఇక, ఈ సినిమాను ఓ యూనివర్శల్ కథతో తెరకెక్కించబోతున్నాడట శేఖర్ కమ్ముల. ఇందుకోసం తొలిసారి తన పంథాను మార్చుకుని ఓ మాస్ కథను రెడీ చేశాడట. ఇందులో మిగిలిన నటీనటులను త్వరలోనే ప్రకటిస్తారని టాక్.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
శేఖర్.. ధనూష్ మూవీలు రెడీగానే

శేఖర్.. ధనూష్ మూవీలు రెడీగానే

శేఖర్ కమ్ముల.. నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో 'లవ్ స్టోరీ' అనే సినిమా తీశాడు. ఇది కరోనా రెండో దశ కారణంగా విడుదల కాలేదు. ఆగస్టులో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మరోవైపు ధనూష్ 'జగమే తందిరమ్' అనే మూవీ చేశాడు. ఇది ఈరోజే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X