రజనీకాంత్ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు: ధనుష్
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'కాలా' జూన్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం సాయంత్రం పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రజనీకాంత్, ధనుష్, హుమా ఖురేషి, ఈశ్వరి, దర్శకుడు పా రంజిత్, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత ధనుష్ మాట్లాడుతూ 'కాలా' అనేది ప్రజల చిత్రం. ప్రజల కోసం... ప్రజల గురించి తీసిన సినిమా. ఎంతో రీసెర్చ్ చేసి తీసిన బోల్డ్ మూవీ. ధారావి ప్రజల యూనిక్ లైఫ్ స్టైల్ రంజిత్ ఎంతో బాగా కాప్చర్ చేశారు. వారు ఎలా స్ట్రగుల్ అయ్యారు, సర్వైవ్ కావడానికి ఎలా ఫైట్ చేశారు అనేది చూపించారు. ఇది కేవలం ధారావి ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సినిమా కాదు. దేశంలో, ప్రపంచంలో చాలా చోట్ల ప్రజలు ఇలానే నిర్లక్ష్యం చేయబడ్డారు. 'కాలా' అనేది ఒక సందేశాత్మక చిత్రం. కామన్ మ్యాన్ సమస్యలపై పోరాటం చేసే 'కాలా' అనే లీడర్ సినిమా ఇది. ఆ పాత్రను సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ చేశారు... అని ధనుష్ తెలిపారు.
40 సంవత్సరాలుగా రజనీ సర్‌ను ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇండస్ట్రీకి వస్తున్న చాలా మంది నటులు నెక్ట్స్ రజనీకాంత్ అవ్వాలని కలలుకంటుంటారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రజనీకాంత్ స్థానాన్ని రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే రజనీకాంత్ అనే వ్యక్తి ప్రపంచంలో ఒకరే ఉంటారు... అని ధనుష్ తెలిపారు.
రజనీకాంత్ మన దేశం గర్వపడే నటుల్లో ఒకరు. రజనీకాంత్ అనే పేరు వినగానే ఇతర దేశాల ప్రజలకు ఇండియా అని గుర్తుకు వచ్చే స్థాయికి ఆయన ఎదిగారు. అలాంటి వ్యక్తి సినిమా నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రజనీ సర్‌కు థాంక్స్ చెబుతున్నాను అని ధనుష్ తెలిపారు.


Click it and Unblock the Notifications











