Sir Movie సింపుల్ సినిమా.. గొప్ప సందేశం.. నిర్మాత ఆ మాట చెబుతుంటే భయమేసింది.. ధనుష్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం సార్ (తెలుగు)/‌ వాతి (తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో 'సార్'(వాతి)పై తమిళంతోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ మాట్లాడుతూ..

తెలుగు రాదని భయపడ్డాను

తెలుగు రాదని భయపడ్డాను

నా తొలి చిత్రం 2005లో రిలీజైంది. ఇప్పుడు నా తొలి తెలుగు సినిమా సార్ రిలీజ్ అవుతున్నది. అప్పుడు ఎలా నెర్వస్‌గా ఉందో.. ఇప్పుడు అలాంటి నెర్వస్ నాకు ఉంది. తెలుగు సినిమా చేయాలని అనుకొన్నప్పుడు.. నాకు తెలుగు రాదని భయపడ్డాను. కానీ సముద్రఖని కూడా ఉండటంతో తమిళం తెలిసిన ఓ వ్యక్తి ఉన్నాడని ధైర్యం చేశాను. కానీ ఆయనకు తెలుగు మాట్లాడటం, రాయడం వచ్చు. ఆయన చాలా సినిమాలు చేయడం హ్యాపీగా ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతున్నది. అందుకు చాలా ఆనందంగా ఉంది అని ధనుష్ అన్నారు.

సింపుల్ స్టోరి.. సింపుల్ యాక్టింగ్

సింపుల్ స్టోరి.. సింపుల్ యాక్టింగ్


సార్ సినిమా సింపుల్ స్టోరి. నేను చాలా సింపుల్ యాక్టింగ్ చేశాను. కానీ ఈ సినిమా గొప్ప సందేశం ఇస్తుంది. ఈ సినిమా మీకు ఎందుకు నచ్చుతుందంటే.. ఇది మీ సినిమా. కానీ నాగవంశీ, వెంకీ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెబుతుంటే నాకు భయమేసింది. కానీ ఇది మీ స్టోరి. మీకు నచ్చుతుందని నేను అనుకొంటున్నాను. దర్శకుడు వెంకీకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నాకు సహాయం అందించిన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అని ధనుష్ చెప్పారు.

సాయికుమార్ సతీమణికి థ్యాంక్స్

సాయికుమార్ సతీమణికి థ్యాంక్స్


సార్ సినిమా చేసినప్పటి నుంచి నాకు ప్రతీ రోజు సాయికుమార్ ఇంటి నుంచి భోజనం వచ్చేది. ప్రతీ రోజు మంచి భోజనం పెట్టారు. మంచి భోజనం పెట్టిన మీ సతీమణి సురేఖకు థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. సినిమాటోగ్రాఫర్ యువరాజ్‌ చాలా పాజిటివ్ వ్యక్తి. ఆయనతో పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ధనుష్ అన్నారు.

హైపర్ ఆది ఫాలోయింగ్ గురించి

హైపర్ ఆది ఫాలోయింగ్ గురించి


హైపర్ ఆది గురించి మాట్లాడుతూ.. గత ఈవెంట్‌లో హైపర్ ఆది మాట్లాడుతుంటే.. ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. అప్పుడు హైపర్ ఆదికి ఉన్న ఫాలోయింగ్ నాకు తెలిసింది. హైపర్ ఆది మాట్లాడిన తర్వాత మనం ఏమీ మాట్లాడలేం. యూట్యూబ్‌లో హైపర్ ఆది పాపులర్ అని తెలిసింది. ఇక నుంచి నేను హైపర్ ఆది వీడియోలు చూస్తుంటాను అని ధనుష్ అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి

త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి


సార్ సినిమా మీ అందర్నీ ఆకట్టుకొంటుందని భావిస్తున్నాం. తప్పకుండా మిమల్ని సంతృప్తి పరుస్తుంది. త్రివిక్రమ్ చెప్పిన మాటలు, ఆయన స్వాగతించిన తీరు నాకు చాలా ఆనందం కలిగించాయి. మళ్లీ తెలుగు సినిమా చేస్తే.. నేను తెలుగులోనే మంచిగా మాట్లాడుతాను అంటూ చివరిగా మాస్టారు మాస్టారు పాటను పాడి ఈవెంట్‌కు వచ్చిన అభిమానులను సంతోషానికి గురిచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X