SIR Twitter Review: సార్‌గా ధనూష్ అరాచకం.. మూవీకి ఊహించని టాక్.. అసలైందే మైనస్‌ కావడంతో!

అద్భుతమైన నటనతో, విభిన్నమైన సినిమాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న హీరో ధనూష్. సుదీర్ఘ కాలంగా కోలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న అతడు.. నేరుగా తెలుగులో ఓ ప్రాజెక్టు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్/వాతి' అనే సినిమాను చేశాడు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఇది.. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? ధనూష్‌కు ఎలా చేశాడు? అనేవి చూసేద్దాం పదండి!

సార్‌గా ఎంట్రీ ఇచ్చిన ధనూష్

సార్‌గా ఎంట్రీ ఇచ్చిన ధనూష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ నటించిన తాజా చిత్రమే 'సార్' (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ సంగీతం ఇచ్చాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు నటించారు.

అలాంటి కథతో వచ్చిన మూవీ

అలాంటి కథతో వచ్చిన మూవీ

ఎప్పుడూ ప్రయోగాలు చేసే కోలీవుడ్ స్టార్ ధనూష్ నటించిన చిత్రమే 'సార్'. ఈ మూవీ ఎడ్యూకేషన్ సిస్టమ్‌లో ఉన్న లొసుగులను ఎత్తి చూపడంతో పాటు వాటి వెనుక ఉన్న కారణాలు, వాటిని పరిష్కరించే మార్గాలను చూపించడం అనే అంశాలతో ఇది తెరకెక్కింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

‘సార్‌’కు ట్విట్టర్‌లో టాక్ ఇలా

విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ధనూష్ 'సార్' మూవీ ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్లా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ట్విట్టర్‌లో కొందరు బాగుందని, మరికొందరు యావరేజ్ అని అంటున్నారు.

మొదటి సగం ఏవరేజ్ అని

కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్ హీరోగా నటించిన 'సార్' మూవీని తాజాగా వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయం వెల్లడిస్తూ ట్వీట్ చేశాడు. అందులో 'సార్ మూవీ ఫస్టాఫ్ ఏవరేజ్‌గా ఉంది. ఇది ఓ సాధారణమైన కథ. కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సినిమా అంతా నెమ్మదిగా సాగుతుంది. దీంతో నార్మల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు.

మంచి మెసేజ్ ఇచ్చారంటూ

కోలీవుడ్ స్టార్ ధనూష్ - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందిన 'సార్' మూవీని చూసిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. అందులో 'సార్ మూవీలో ధనూష్ గారు, సంయుక్త మీనన్ గారు మీ యాక్టింగ్ అదుర్స్. వెంకీ అట్లూరి డైరెక్షన్ సూపర్. మూవీ బాగుంది. మా అందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు' అంటూ సినిమా ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు.

ధనూష్ సూపర్.. ఫెయిల్

ధనూష్ - సంయుక్త మీనన్ నటించిన 'సార్' మూవీని చూసిన ఇంకో నెటిజన్ 'సార్ మూవీ విద్యా వ్యవస్థ వెనుక ఉన్న మాఫియాపై చేసే నిజాయితీ పోరాటంతో వచ్చింది. మంచి ఎమోషన్స్, కామెడీ ఉన్నాయి. ధనూష్ వన్ మ్యాన్ షో చేశాడు. అయితే, సెకెండాఫ్ స్లోగా ఉంది. క్లైమాక్స్ థ్రిల్ చేయడంలో ఫెయిల్ అయింది. కానీ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది' అని చెప్పారు.

నన్ను నిరాశ పరిచింది

'సార్' మూవీని చూసిన మరొక నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు. అందులో 'సార్ మూవీ నన్ను నిరాశ పరిచింది. ఇందులో ఎమోషన్ డెప్త్ అస్సలు లేదు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉన్నా.. సెకెండాఫ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అయితే, క్లైమాక్స్ చూపించిన విధానం బాగుంది. ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయి ఉంటే ఇది మంచి చిత్రం అయ్యేది' అంటూ అభిప్రాయాన్ని చెప్పారు.

అదే మైనస్.. కానీ బాగుందని

అదే మైనస్.. కానీ బాగుందని

ధనూష్ నటించిన 'సార్' మూవీని వీక్షించిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో 'ఇప్పుడే సార్ మూవీ చూశాను. స్టోరీ ఊహించదగినట్లుగానే ఉంది. కానీ, స్క్రీన్‌ప్లే మాత్రం బాగుంది. ధనూష్ యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. మిగిలిన వాళ్లు కూడా బాగానే చేశారు. తొలిప్రేమ తర్వాత వెంకీ అట్లూరి మంచి సినిమా ఇచ్చాడు. ఇది ఎప్పటికీ గుర్తుండే సినిమా' అని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X