థ్రిల్లింగ్ మూమెంట్, ధనుష్ నెక్ట్స్ సినిమా మెగాస్టార్‌తో
ముంబై: సౌత్‌లో రజనీకాంత్‍తో కలిసి ఒక్కసారైనా నటించాలని ప్రతి ఒక్క నటుడు, నటి కోరుకుంటూ ఉంటారు. మరి ఆయన రేంజి అలాంటి. అలాగే బాలీవుడ్‌లో మెగాస్టార్‌గా ఎదిగిన అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించాలని చాలా మంది ఉవ్విల్లూరుతుంటారు. తాజాగా ఆ అవకాశం కూడా దక్కించుకున్నాడు రజనీకాంత్ అల్లుడు ధనుష్. ఇప్పటికే 'రంఝానా' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్ రెండో సినిమా అమితాబ్ బచ్చన్‌తో కలిసి చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆర్ బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మధ్య ధనుష్ ఎక్కడ కనిపించినా నెక్ట్స్ బాలీవుడ్ మూవీ ఎవరితో చేస్తున్నారంటూ మీడియా వాళ్లు, అభిమానులు తెగ విసిగిస్తున్నారు. దీంతో ధనుష్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టారు. 'నా తర్వాతి హిందీ సినిమా బాల్కి సార్‌తో చేస్తున్నాను. నాకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్నాను' అని ధనుష్ వెల్లడించారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. దర్శకుడు బాల్కితో అమితాబ్ బచ్చన్, ఇళయారాజా కలిసి పని చేయడం ఇది మూడో సారి. గతంతో 'paa', 'Cheeni Kum' చిత్రాల్లో వీరు కలిసి పని చేసారు. తాజాగా తెరకెక్కుతున్న చిత్రాన్ని తమిళంలోకి కూడా అనువదిస్తారని సమాచారం.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రంలో ధనుష్ సరసన కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ప్రస్తుతం ధనుష్ తన తమిళ సినిమా Velaiyilla Pattathari చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు.


Click it and Unblock the Notifications











