»   » హైబ్రిడ్ పిల్ల టెన్షన్ ని ఆ హీరో అలా మాయం చేస్తాడట!

హైబ్రిడ్ పిల్ల టెన్షన్ ని ఆ హీరో అలా మాయం చేస్తాడట!

Subscribe to Filmibeat Telugu

సాయి పల్లవి సౌత్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్. కేవలం తన నటన, హావభావాలతో సినిమా రిజల్ట్ నే మార్చేయగల సత్తా సాయి పల్లవికి ఉంది. సాయి పల్లవి నటించిన ఫిదా, ఎంసీఎల్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. సాయిపల్లవి ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. సాయి పల్లవి హీరో ధనుష్ మారి 2 మరియు సూర్య ఎన్ జి కె చిత్రాలలో నటిస్తున్నా సంగతి తెలిసిందే.

ఇటీవల ఇంటర్వ్యూ లో సాయిపల్లవి ఆయా చిత్ర విశేషాలని వెల్లడించింది. మారి 2 చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయాన్ని సాయి పల్లవి వెల్లడించింది. తాను సెట్స్ లో ప్రతిసారి టెన్షన్ పడుతుంటానని కానీ ధనుష్ తన వత్తిడిని అమాంతం తగ్గించేస్తాడని తెలిపింది. సూర్య సెట్స్ లో వేసే జోకులు అలా ఉంటాయని తెలిపింది. కానీ కెమెరా ముందు మాత్రం ధనుష్ నటన జీవించినట్లు ఉంటుందని కితాబిచ్చింది.

Dhanush would crack jokes to ease my tension says Sai Pallavi

సూర్య సరసన నటించాలనేది తన కల అని తెలిపింది. ఆ కల సాకారం కాబోతుండడంతో సంతోషంగా ఉందని సాయి పల్లవి తెలిపింది. తాను చిన్న తనం నుంచే సూర్యకు పెద్ద అభిమాని అని తెలిపింది.

English summary
Dhanush would crack jokes to ease my tension says Sai Pallavi. She told about Suriya NGK movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X