రామ్ చరణ్ తేజ నెక్ట్స్ చిత్రం కన్ఫర్మ్!?
పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రాన్ని రూపొందించిన ధరణి రామ్ చరణ్ తేజ తో సినిమా చేయటానికి కమిట్ అయ్యారని సమాచారం. ఈ మేరకు రీసెంట్ గా ఎగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది. ఫాంటసీ కలగలపిన కథతో ఈ చిత్రం రూపొందనుందని,భారీ బడ్జెట్ ఈ చిత్రానికి కానున్నదని చెప్తున్నారు. రెండు నెలల క్రితమే ధరణి తను రాసిన స్క్రిప్టుని అందచజేసారని, మధ్యలో రెండు సార్లు కధలో క్లారిఫికేషన్ కి వచ్చి చెప్పిన కొన్ని మార్పులు చేసారని..ఆ తర్వాతనే ఈ చిత్రం చేయటానికి రామ్ చరణ్ పచ్చ జెండా ఊపారంటున్నారు. అయితే పవన్ తో చేసిన సినిమా సంతృప్తినివ్వలేదని, ఈసారి అటువంటి సమస్యరాదని, రొమాంటిక్ లైన్ కూడా కథలో వచ్చేలా చూసారని, కాబట్టి యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ మేరకు ధరణి కూడా తమిళంలో ఓ ఇంటర్వూలో తాను రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇక ధరణికి ఈ మధ్యన తమిళంలో చెప్పుకోతగ్గ హిట్టులు లేవు. డిమాండ్ ఉన్నా అది పెద్ద హీరోలు, నిర్మాతల నుంచి లేదు. దాంతో ఆయన కన్ను ఇటు వైపు వేసారు. అంతేగాక మరో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా ఇక్కడ సినిమాలు చేస్తూండటంతో అక్కడ దర్శకులంతా తెలుగు పరిశ్రమలో హీరోలు చుట్టూ తిరుగుతున్నారు. అందుకు కారణం దర్శకుడుకి తమిళనాడులో దొరికే రెమ్యునేషన్ కన్నా ఇక్కడ నాలుగైదు రెట్లు ఇక్కడ ఎక్కువ దొరకటమేనని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ..బొమ్మరిల్లు భాస్కర్(అతను తమిళుడే) దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత లింగు స్వామి(పందెం కోడి ఫేమ్) దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ వారికి సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. లింగుస్వామి కూడా తమిళుడే కావటం విశేషం.


Click it and Unblock the Notifications











