పవన్ కళ్యాణ్ దర్శకుడుతో రామ్ చరణ్ సినిమా?
పవన్ కళ్యాణ్ హీరోగా బంగారం చిత్రాన్ని రూపొందించిన తమిళ దర్శకుడు ధరణి త్వరలో రామ్ చరణ్ ని డైరక్ట్ చేయనున్నారని సమాచారం. ఈ మేరకు ఓకే అనిపించుకునే ధరణి స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఆరెంజ్ అనంతరం ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. అలాగే మరో తమిళ దర్శకుడు లింగు స్వామితో చిత్రం కూడా ప్రపోజల్ ఉన్నట్లే చెప్తున్నారు. ఇక ధరణి తమిళ్ లో మాస్ డైరక్టర్ గా పేరుతెచ్చుకున్నవాడు. విక్రమ్ తో దిల్,ధూల్ చిత్రాలు చేసి సూపర్ హిట్ కొట్టాడు. అలాగే విజయ్ తో గిల్లీ(ఒక్కడు రీమేక్) చేసి విజయం సాధించాడు.ఆ తర్వాత తెలుగులో చేసిన బంగారం ఫ్లాఫ్ అయింది.అనంతరం విజయ్ తో చేసిన కురవై కూడా పరాజయం పాలైంది. దాంతో ధరణి కన్ను తెలుగు మార్కెట్ పై పడింది. ప్రభాస్ వంటి హీరోలకు ఇంతకు ముందు కథ లు చెప్పాడు కానీ వర్కవుట్ కాలేదు. అయితే రామ్ చరణ్ మాత్రం హామీ ఇచ్చి ప్రాజెక్టును మూవ్ చేసినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











