మరీ ఈ టైపు పుకార్లా..!? తమన్నా పై ఫిర్యాదు అంతా ఉత్తుత్తినే అట

ఎలా వస్తాయో ఏమో గానీ సినిమా ఇండస్ట్రీలో గాసిప్పులకి కొదవ ఉండదు. ఒక్కోసారి నిజమేదో అబద్ద మేదో తెలియనంత అయోమయం లో పడేస్తారు గాసిప్ రాయుల్లు. చిన్న సంఘటన జరిగినప్పుడు దానికి మరి కాస్త జోడిస్తే చాలు అది సూపర్ న్యూస్ గా చలామనీ అయిపోతుంది. ఈ గాసిప్పులు ఇదివరకు ఎక్కువగా బాలీవుడ్ లోనే ఉండేవి అయితే ఈమధ్య కోలీవుడ్ అన్నిటినీ మించిపోయింది. వరుసగా గాసిప్పుల మీద గాసిప్ లకు తమిళ హీరో లూ హీరోయిన్లే కాదు దర్శకులూ, నిర్మ్నాతలూ కూడా ఇరుక్కుంటున్నారు. ఇంతకీ ఇప్పుడీ విషయం ఎందుకొచ్చిందీ అంటే...

మిల్కీ బ్యూటీ తమన్నా ఆమధ్య తమిళంలో ''ధర్మ దురై 'అనే తమిళ చిత్రంలో నటించింది . అయితే ఆ చిత్ర ప్రమోషన్ కు మాత్రం వెళ్ళలేదు, కానీ తాజాగా ప్రభుదేవా తో కలిసి నటించిన అభినేత్రి తమిళంలో దేవిగా రిలీజ్ అవుతోంది అయితే ఆ చిత్ర ప్రమోషన్ లో మాత్రం బాగానే పాల్గొంటోంది దాంతో నా సినిమాకు మాత్రం ప్రమోషన్ కు రాలేదు మరో సినిమా కోసం మాత్రం అంతగా తపించి పోతోంది దాంతో ధర్మ దురై నిర్మాత ఆర్.కె. సురేశ్ తమన్నా పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ కు తమన్నా పై ఫిర్యాదు చేసాడు. అంటూ కొందరు చెప్పుకున్నారు.

దాంతో 'ధర్మదురై' ప్రచార కార్యక్రమాల సమయంలో తమన్నా సరిగ్గా సహకరించలేదంటూ తమిళ నటీనటుల సంఘంలో ఆయన ఫిర్యాదు చేశారనే వార్త బయటికొచ్చింది. గురువారం మొతం చెన్నైలో ఇదే హాట్ టాపిక్. అయితే తనకు తెలియకుండా తాను ఫిర్యాదు ఎప్పుడు చేసానో అర్థం కాని ఆర్.కె. సురేశ్ శుక్రవారం హడావుడి గా మీడియాను కాంటాక్ట్ అయ్యి ఈ వార్త గురించి వివరణ ఇచ్చారు. ''తమన్నా నా ఫేవరెట్ ఆర్టిస్ట్. తనంటే నాకు చాలా గౌరవం. నా లక్కీ హీరోయిన్. 'ధర్మదురై' కోసం నేను అడగ్గానే కథ విని వెంటనే ఒప్పుకుంది. 'బాహుబలి' షూటింగ్‌లో ఉండి కూడా ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలకు వచ్చింది. వాస్తవానికి నేను నిర్మించే తదుపరి సినిమాలో కూడా తనను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నాను. అలాంటిది తమన్నా గురించి నేనెందుకు ఫిర్యాదు చేస్తాను? అసలిదంతా అబద్దం ఎవరు చేసారో తెలియదు కానీ కావాలనే ఈ వార్థను సృష్టించారు" అని పేర్కొన్నారు. దాంతో అప్పటివరకూ జరుగుతున్న ప్రచారనికి తెరపడింది.

Tamanna

కాగా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో తమన్నా కొనసగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్లను ఖాతాలో వేసేసుకుందీ "అవంతిక". కార్తితో నటించిన 'తోళా', విజయ్‌సేతుపతితో కలసి నటించిన 'ధర్మదురై' అమ్మడుకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. మరోవైపు ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'దేవి' (అభినేత్రి) కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇంకొక వైపు శింబు సరసన 'అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌' సినిమాలో కూడా నటిస్తున్నారు. తనకు కోలీవుడ్‌ పరిశ్రమే నటిగా మంచి గుర్తింపును తీసుకొచ్చిందంటూ ఇటీవల చెన్నైకి వచ్చినప్పుడు కూడా ఆమె చెప్పారు. నటిగా మెరుపులు మెరిపించిన ఆమె.. త్వరలోనే ఓ తమిళ సినిమాకు నిర్మాతగా కూడా మారుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం సాగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల వెలువడనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారమవుతోంది. గతం లో చాలామందే హీరోయిన్లు మంచి పీక్ లో ఉన్న సమయం లో ఇలాగే నిర్మాతలు గా మారి చేతులు కాల్చుకున్నారు మరి తమన్నా సంగతేమౌతుందో చూడాలి...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X