For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధర్మవరపు సుబ్రమణ్యం 'ఒక తుపాకి మూడు పిట్టలు'

    By Srikanya
    |

    హాస్య నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం హీరోగా చేస్తున్న చిత్రానికి 'ఒక తుపాకి మూడు పిట్టలు' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఒక తుపాకి మూడు పిట్టలు' అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందని భావించి ఖరారు చేసినట్టు తెలిపారు.

    ధర్మవరపు, అనుష్కా రాయ్, షఫాలీ శర్మలపై ఇటీవల శ్రీశైలం, వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరిపామనీ, కమెడియన్లు అంతా పాల్గొనగా హీరోహీరోయిన్లపై ఛేజింగ్ దృశ్యాలు తీశామనీ చెప్పారు. దీంతో తొలి షెడ్యూల్ పూర్తయిందని అన్నారు. ఈనెల 16 నుంచి వికారాబాద్, నర్సాపూర్ అడవుల్లో రెండో షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు నిర్మాత రాజా తెలిపారు.

    హీరోహీరోయిన్లతో పాటు సూర్య, ఎల్బీ శ్రీరామ్, బ్రహ్మానందం, అశోక్ కుమార్, గుండు హనుమంతరావు తదితరులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని చెప్పారు. విభిన్నమైన కథ, వినూత్నమైన మాటలు అందించే అవకాశం ఈ చిత్రంతో కలిగినట్టు సంభాషణల రచయిత దీపికా రాజు తెలిపారు. కథ-స్క్రీన్ ప్లే సైతం రామ్ కుమార్ అందించిన ఈ చిత్రానికి పైడాల శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, రమేష్ ఎడిటింగ్, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X