'బిజినెస్ మ్యాస్'లో ధర్మవరపు పాత్ర కేక

అలాగే పూరీ జగన్నాధ్ తన చిత్రాల్లో కామిడీ ట్రాక్ కి ప్రత్యేకమైన శ్రధ్ద పెడుతూండటం తెలిసిందే. పోకిరిలో బ్రహ్మానందం,అలీ ట్రాక్ ఎంత పండిందో తెలిసిందే. పోకిరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలోనూ హిలేరియస్ కామిడి ఉంటుందని భరోసా ఇస్తున్నారు. మరో ప్రక్క సార్..వస్తారా అనే పాట ఎక్కడ విన్నా అదే వినపడుతోంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే జనం నోళ్లలో నానుతున్నాయి. ఇక నేరం కూడా ఇతర వ్యాపారం లాంటిదేనని భావించే గ్యాంగ్‌స్టర్ కథే 'ద బిజినెస్‌మ్యాస్'. చిత్రంలో మహేష్ బాబు సూర్య అనే పాత్రలో కనిపిస్తాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన 'కంపెనీ'లోని గ్యాంగ్‌స్టర్ల మధ్య పోరాటాలు, పూరి రూపొందించిన 'పోకిరి'లోని వినోదం..రెండూ ఈ సినిమాలో కనిపిస్తాయి.
మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, కో డైరెక్టర్: విజయ ప్రసాద్.


Click it and Unblock the Notifications











