యశోద ఆస్పత్రిలో నటుడు ధర్మవరపు
హైదరాబాద్ : ఉదరకోశ సమస్యతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం చికిత్స కోసం గురువారం మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ వంశీధర్‌రెడ్డి ఆయనకు వైద్యసేవలందిస్తున్నారు. గ్యాస్ట్రో, రక్త,మూత్ర పరీక్షలు చేశారు. కంగారుపడవలిసిందేమీలేదని ప్రస్తుత వైద్యం జరుగుతోందని,త్వరలోనే ఉదర సమస్యలనుంచి ఉపశమనం పొందుతారని అని హాస్పటిల్ వర్గాలు చెప్పాయి.
తెలుగు చిత్రాల్లో విలక్షమైన మ్యానరిజంతో హాస్యాన్ని పండించే నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం. తన హాస్యపు జల్లులతో అందరినీ నవ్వించే ఆయన సాక్షి ఛానెల్ లో డింగ్ డింగ్ అనే పోగ్రాం చేస్తున్నారు. దూరదర్శన్ లో తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఆనందో బ్రహ్మ తో ఆయన పేరు తెచ్చుకున్నారు. 1989లో ఆయన బావా బావా పన్నీరు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అప్పటినుంచీ ఆయన తెలుగు ప్రేక్షకులకు హాస్య నిధిగా మారారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్చరర్ అసోసియేషన్ ఛైర్మన్ గా కూడా ధర్మవరపు చేసారు.


Click it and Unblock the Notifications












