నాన్న 'యస్'అనగానే షాకయ్యా
"ఆయన 'యస్' అన్నప్పుడు నేను నిజంగా షాకయ్యా. మొదట్లో నేను అడిగినప్పుడు ఎప్పట్లాగే 'చూద్దేంలేరా' అని తప్పించుకున్నారు. తర్వాత ఒక రోజు ఇంటికొచ్చి 'నేను నటిస్తున్నా' అన్నారు. మొదట నా చెవుల్ని నేనే నమ్మలేకపోయా. ఇది నా కల నిజమవడం లాంటిదే అంటూ ఎక్సైట్మెంట్ తో చెప్పుకొచ్చింది ఇషాడయోల్. ఆమె తాజాగా 'టెల్ మి ఓ ఖుదా'అనే చిత్రం కమిటైంది.ఈ చిత్రంలో ఆమె తండ్రిగా నిజ జీవిత తండ్రి ధర్మేంద్ర నటించటానకి ఒప్పుకున్నాడు.ఈ విషయాన్ని మీడియాకు చెప్తూ ఇలా ఎమోషన్ ఫీలయ్యింది. ఇక ఈ చిత్రాన్ని ఆమె తల్లి, ఒకప్పటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో ఇషా కెరీర్‌ని మలుపు తిప్పాలనేది ఆమె ఆలోచన. తన తండ్రి కోసం అన్వేషించే ఓ అమ్మాయి కథ 'టెల్ మి ఓ ఖుదా'.


Click it and Unblock the Notifications











