కన్నడంలో ...ఢీ, రెడీ
జగడం సినీ నిర్మాత ఆదిత్యబాబు ఇప్పుడు కన్నడంలో హీరోగా తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే.తెలుగులో పెద్ద హిట్టయిన ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రాన్ని Anthu Inthu Preeti Banthu పేరుతో అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఆగస్టు లో రిలీజయ్యే ఈ సినిమా మార్కెట్ ఆఫర్స్ బాగుండటంతో ఆయన మరిన్ని తెలుగు చిత్రాలు రీమేక్ చేయాలని భావిస్తున్నారు.అందుకోసం ఆయన ఢీ,రెడీ చిత్రాలును ఫాన్సీ ఆఫర్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.పునీత్ రాజ్ కుమార్ తో రెడీ చిత్రాన్ని చేయటానికి ఇప్పటికే ఎగ్రిమెంటు కుదిరిందిట.ఇక ఢీ చిత్రాన్ని ఆదిత్యే హీరోగా చేయాలని యోచిస్తున్నారుట.అలాగే పోకిరి ని కూడా కన్నడంలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు.దాని నిమిత్తం మాటలు జరుగుతున్నారుట. మొత్తానికి మన చిత్రాలు కన్నడంలో త్వరలో రానున్న సంగతి సినీ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications











