twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ‘దేనికైనా రెడీ’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు విష్ణు, హన్సిక మొత్వాని జంటగా ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రం'దేనికైనా రెడీ' . జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులతో పాటు, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం అక్టోబర్ 24న విజయదశమిని పురస్కరించుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.

    ఆంధ్రప్రదేశ్ మినహా ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో ఈచిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన తెలుగు వారి కోసమే ఇలా చేస్తున్నారు. వారికి తెలుగు అర్థమైనా.... కొన్ని డైలాగులు అర్థం చేసుకోలేక పోతున్నారని, అలాంటి వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు.

    ఈచిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందినది. విష్ణు ఈ చిత్రంలో సులేమాన్,కృష్ణ శాస్త్రిలుగా కనిపించబోతున్నాడు. సినిమాలో తన పాత్రల గురించి విష్ణు మాట్లాడుతూ... 'లక్ష్యం ఉంటే సరిపోదు. దాన్ని చేరుకొనే మార్గం వెతకాలి. కష్టనష్టాలు పక్కన పెట్టి ఆ దారిలో పయనించాలి. కల నెరవేర్చుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉండాలి. సులేమాన్‌, కృష్ణశాస్త్రిలకు కూడా ఓ గమ్యం ఉంది. దాన్ని అందుకోవడానికి వారు ఏం చేశారో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే' అన్నారు.

    ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌ బాబు.

    English summary
    Manchu Vishnu’s upcoming comedy entertainer ‘Dhenikaina Ready’ is all set to release on October 24th on the occasion of Vijayadasami. The movie is going to release all over the world with English subtitles, except in Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X