నా సినిమా మాస్ జనాలకి నచ్చదంటున్న స్టార్ హీరో
"ఈ సినిమా మాస్ జనాలకి నచ్చదు! ఎందుకంటే ఇది సున్నితమైన విషయంతో కూడుకొన్న కథ. ఎవరైతే సున్నితమైన మనసు కలిగి ఉంటారో వారే ఈ సినిమాను అర్థం చేసుకొంటారు అంటున్నారు అమీర్ ఖాన్. ఆయన తాజా చిత్రం 'దోభీ ఘాట్' గురించి రీసెంట్ గా మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ చిత్రం కథ గురించి చెబుతూ..భిన్న తరగతులకు చెందిన వ్యక్తుల అనుబంధాలు ఎలా ఉంటాయో 'దోభీ ఘాట్'లో చూపించాం. షాయ్ అనే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ కి..మున్నా అనే లాండ్రీ అబ్బాయికి..అరుణ్ అనే చిత్రకారుడికి మధ్య జరిగే కథ ఇది. నా నిర్మాణ సంస్థ నుంచి రాబోతున్న ఓ మంచి చిత్రమిది అని అమీర్ ఖాన్ అన్నారు.
ఇక ఈ చిత్రాన్నివచ్చే ఏడాది జనవరి 31న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీన్ని నిర్మించినందుకు సంతోషంగా ఉన్నాను. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. ఇక ఈ చిత్రంలో అమీర్ ఖాన్ చిత్రకారుడిగా కీలక పాత్రలో నటించారు. మోనికా డోగ్రా, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రధారులు.అలాగే ఆయన భార్య కిరణ్ రావ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం టైటిల్ నుంచి ధోభి అనే పదాన్ని తొలిగించమంటూ కోర్టులో కేసు నమోదైంది. హిందుస్తాన్ కనోజ ఆర్గనైజేషన్ ఆఫ్ ధోబీస్ ఛైర్మన్ వినోద్ కుమార్ కనోజ్ తమ ధోభి కమ్యునిటీని అవమానపరిచేదిలా ఉందంటూ డిల్లీ హైకోర్టులో పిటీషన్ ఫైల్ చేసారు. ఇప్పటికే ఈ చిత్రం టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిచబడి ..పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











