అమీర్ ఖాన్ తాజా చిత్రం "ధోబో ఘాట్" విడుదల తేది
అమీర్‌ఖాన్ భార్య కిరణ్‌రావు తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం "ధోబో ఘాట్" . ఈ చిత్రం జనవరి 21, 2011 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని టొరాంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా ప్రదర్శించారు. అంతేకాదు, బ్రిటన్‌లో కూడా తన చిత్రాలను విడుదల చేయడానికి అమీర్‌ఖాన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ 'పెయింటర్"గా నటించాడు. ఇక ఈ చిత్రంలో ప్రతీక్ బబ్బార్, మోనిక దోర్గా, కార్తీ మల్హోత్రా తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్ క్యాంపైన్స్ ప్రారంభించనున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై నిర్మితమయిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వాసులుకు ఈ చిత్రం వివరాలు గురించి చెబుతూ ఉత్తరాలు రాయాలని నిర్ణయించుకున్నారు.
More from Filmibeat
అమీర్ ఖాన్ త్రి ఇడియట్స్ ధోభీ ఘాట్ కిరణ్ రావ్ రంగేళి aamir khan 3 idiots dhobi ghat kiran rao rangeli


Click it and Unblock the Notifications











