100% కమర్సియల్ అంటున్న ప్రకాష్ రాజ్

By Bojja Kumar

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడిగా మారి 'ధోని' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...ధోనీ సినిమా 100% శాతం కమర్షియల్ సినిమా అని, ఆర్ట్ సినిమా ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. నేను ఎప్పటి నుంచో పిల్లలు, తల్లిదండ్రుల ఆలోచనల మధ్య ఉన్న వ్యత్యాసాలతో సినిమా తీయాలనుకుంటున్నానని, ధోని సినిమాతో అని సాధ్యమైందన్నారు. ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ చెప్పడంతో ఆకాష్ తో చేయిద్దామని నిర్ణయించామని, అలా ఈ సినిమా రూపుదిద్దుకుందని వెల్లడించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం పెద్ద ప్లస్సవుతుందని ప్రకాష్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగులోఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ని దిల్ రాజు తీసుకున్నారని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

ఈ చిత్రంలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రకాష్ రాజ్, ఆకాష్ పూరి, ముగ్ధా గాడ్సే, రాధిక ఆప్టే, బ్రహ్మానందం, నాజర్, తలైవాసల్ విజయ్, ప్రభుదేవా(గెస్ట్ రోల్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఎడిటింగ్: కిషోర్, స్టూడియో: డ్యూయెట్ మూవీస్, నిర్మాత, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాష్ రాజ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X