twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్నీళ్లు ఆగట్లేదు, కష్టంగా ఉంది.. ధోనిపై మహేష్, రాజమౌళి, వెంకీ ఎమోషనల్ కామెంట్స్

    |

    కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరు. భారత జట్టుకు ఎన్నో విజయాల్ని అందించి మిస్టర్ కూల్ కెప్టెన్ గా ఎంతగానో కీర్తిని అందుకున్న ధోని హఠాత్తుగా రిటర్మెంట్ తీసుకోవడం అందరిని కలచివేస్తోంది. ఇక మన టాలీవుడ్ స్టార్స్ కూడా ధోనిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

    చాలా కష్టంగా ఉంది: రాజమౌళి

    చాలా కష్టంగా ఉంది: రాజమౌళి

    నిజంగా మీరు మాకు ఎంతగానో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. దేశం మొత్తం గర్వ పడేలా చేశారు. నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితులలో కూడా మీరు నడిచిన విధానం ప్రశాంతంగా ఉండేలా చేసింది. భవిష్యత్తు తారలకు నిజంగా మీరొక స్ఫూర్తిగా టర్చ్ బేరర్ లా నిలిచారు. మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన క్షణాలను స్వీకరీంచడం చాలా కష్టంగా అనిపిస్తోంది.

    అఖిల్, మంచు బ్రదర్స్ పవర్ఫుల్ కామెంట్స్

    అఖిల్, మంచు బ్రదర్స్ పవర్ఫుల్ కామెంట్స్

    ఎన్నో మరచిపోలేని అద్భుతమైన జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు కెప్టెన్. మీ ప్రయాణం కేవలం ప్రభావితం చేయడమే కాదు, భారత క్రికెట్‌ను ఉత్తమంగా మార్చింది. వాటే లెజెండ్ ఎమ్ఎస్.ధోని అని అఖిల్ కామెంట్ చేయగా మంచు మనోజ్ ధన్యవాదాలు అంటూ ఫోటో షేర్ చేశాడు. ఇక మంచు విష్ణు ఈ విధంగా స్పందించారు. ఆల్ టైమ్ గ్రేటెస్టు కెప్టెన్. ఇన్ని రోజులు క్రికెట్ లో ఉన్నందుకు ధన్యవాదాలు. చాలా మంచి అటిట్యూడ్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉన్నారు.

     కన్నీళ్లు వస్తున్నాయి: మహేష్

    కన్నీళ్లు వస్తున్నాయి: మహేష్

    2011 వరల్డ్ కప్ ఫైనల్ లో ధోని కొట్టిన సిక్సర్ ని గుర్తు చేస్తూ మహేష్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. ఆ ఐకానిక్ సిక్సర్‌ను నేను ఎలా మరచిపోగలను !! ప్రపంచ కప్ ఛాంపియన్స్ 2011 ఇండియా !! వాంఖడే వద్ద స్టాండ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. గర్వంగా, కన్నీళ్లు కారుతున్నాయి.. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు.. టేక్ ఏ బౌ అంటూ ధోనీకి నమస్కారాలు చేస్తున్నట్లు మహేష్ ట్వీట్ చేశారు.

    Recommended Video

    Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
    మిస్ అవుతున్నాం: వెంకటేష్

    మిస్ అవుతున్నాం: వెంకటేష్

    ఇక క్రికెట్ ని అమితంగా ఇష్టపడే విక్టరీ వెంకటేష్ ఈ విధంగా పేర్కొన్నారు. మీ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నిజంగా మేము క్రికెట్ ఫీల్డ్ లో నిన్ను చాలా మిస్ అవుతాము అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే మరికొందరు యువ హీరోలు కూడా ధోని రిటైర్మెంట్ పై చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు.

    English summary
    Mahendra Singh Dhoni is one of the few cricketers to have fans not only in India but all over the world. The sudden retirement of Dhoni, who has been credited as the captain of the Indian team for his many victories, is suddenly touching everyone. And our Tollywood stars are also making emotional comments remembering Dhoni.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X