మెగాభిమానుల ఛాలెంజ్ పై దూకుడు నిర్మాత
దూకుడు రికార్డులు తప్పని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ తను ఛాలెంజ్ చేసానంటూ వస్తున్న వార్తలను నిర్మాత అనీల్ సుంకర ఖండించారు.ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..దూకుడు విజయంతో మా టీమ్ అంతా చాలా ఆనందంగా ఉంది.మహేష్ ప్యాన్స్,తెలుగు సినీ పరిశ్రమ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.నేను ఇప్పటికీ చెప్తున్నారు దూకుడు చిత్రం ఎనభై సంవత్సరాలు తెలుగు సిని పరిశ్రమ రికార్డులను తిరగ రాసింది.ఇప్పటికీ అదే మాటపై నిలబడి ఉన్నాను.అలాగే ఈ చిత్రం రికార్డుల విషయమై నేను ఏ విధమైన ఛాలెంజ్ లు చేయలేదు..పబ్లిక్ స్టేట్మెంట్ లు ఇవ్వలేదు.కొంతమంది నా మాటలను వక్రీకరించి,స్పైస్ అద్ది ప్రచారం చేస్తున్నారు.మేము ఇక్కడ ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశ్యంలో లేము అన్నారు.మా సినిమానే ప్రతీ విషయాన్ని మాట్లాడుతుంది.ఇది ఎంజాయ్ చేసే సమయం అన్నారు.ఇక గత కొద్ది రోజులుగా దూకుడు రికార్డు విషయమై మెగాభిమానులుకు,మహేష్ అభిమానులకు మధ్య వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి.మగధీర రికార్డులను దూకుడు బ్రేక్ చేయలేదని,అవి ఫేక్ రికార్డులని ఆ విషయం నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తామని మెగాభిమానులు ప్రకటించారు. వెంటనే మహేష్ అభిమానులు తాము దూకుడు రికార్డులు ఫేక్ అని నిరూపిస్తే కోటి ఇస్తామని కౌంటర్ వేసారు.


Click it and Unblock the Notifications











