షారూఖ్ హీరో, అమీర్ విలన్: ధూమ్-3 ఫేక్ ట్రైలర్
సాంకేతిక పరిజ్ఞానం పెరగడమేమోగానీ ఇంటర్నెట్ లో ఆకతాయిల చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హీరో, హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టి మహదానందం పొందుతుంటారు కొందరు అబిమానులు. తాజాగా వీరు మరో కొత్త పోకడను మొదలుపెట్టారు. తమ అభనహీరో సినిమా పలానా పేరుతో వస్తుందని లీక్ కావడం ఆలస్యం....ఆ పేర్లతో ఫేక్ వీడియోలను సృష్టించి నెట్ లోకి వదులుతున్నారు.
ధూమ్-2 సినిమాకు సీక్వెల్ గా ధూమ్-3 సినిమా రాబోతోందని, ఇందులో అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ కలిసి నటిస్తున్నారనే విషయం బయటకు లీక్ కాగానే.....అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ గతంలో నటించిన కొన్ని సినిమాల్లోని వీడియో క్లిప్పంగులను, ధూమ్ సినిమా వీడియో క్లిప్పంగులతో మార్పింగ్ చేసి ఇదే ధూమ్-3 అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియో చూసి షాక్ తినడం దర్శక నిర్మాతలు, హీరోల వంతవుతుతోంది. ఇందులో షారూఖ్‌ను హీరోగానూ అమీర్ ఖాన్‌గానూ చిత్రించి ఆనందం పొందుతున్నారు. ఇంకా సినిమా ప్రారంభమే కాలేదు.ఈ వీడియో ఏమిట్రా అని తల పట్టుకుంటున్నారు.


Click it and Unblock the Notifications