twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను లేకుంటే ఆ సినిమాలేదు, నేనే రియల్ హీరోను...

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా 'ధూమ్' చిత్రం వరుస సిరీస్‌లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడో సీరిస్ 'ధూమ్-3' కూడా తెరకెక్కింది. అయితే ఈ మూడు సిరీస్‌లలో ఎవరు మారినా...ఈ ఇద్దరూ మాత్రం జై దీక్షిత్, అలీ అక్భర్ పాత్రల్లో ఫిక్స్ అయిపోయారు.

    తాజాగా 'ధూమ్-3' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ...ఇది నా సినిమా, ఈ సినిమాకు నేనే హీరో.... నేను, ఉదయ్ చెప్రా లేకుంటే ఈ సినిమా లేదు. ఇందులోకి ఎవరూ వచ్చినా నా నుంచి తప్పించుకోలేరు, మేమే రియల్ హీరోలం అని వ్యాఖ్యానించారు. అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యల వెనక పెద్ద అర్థమే ఉంది.

    ధూమ్ సిరీస్ సినిమాల్లో ప్రధాన పాత్రదారులంతా విలన్లే. దొంగతనాలు, రాబరీలు చేస్తుంటారు. వీరి ఆకట్టించే పనిలో ఉంటారు సూపర్ పోలీస్ ఆఫీసర్లు జై దీక్షిత్, అక్బర్ అలీ. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

    అమీర్ ఖాన్, కత్రినా కైఫ్‌లపై చిత్రీకరించిన ఓ పాటకు ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఓ పాటకు ఇంత ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. కత్రినా, అమీర్‌లపై చిత్రీకరించిన ఈ పాటలో 200 మంది జిమ్నాస్టిక్ కళాకారులను అమెరికా నుంచి తీసుకొచ్చారట. కళ్లు చెదిరేలా వేసిన సెట్లో 20 రోజుల పాటు ఈ పాట చిత్రీకరించారని, సినిమాకు ఈ పాట హైలెట్ అవుతుందని అంటున్నారు.

    ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధం అవుతోంది.

    English summary
    Actor Abhishek Bachchan, who has been a constant feature in the Dhoom series, says he is the hero of the film which could not have been made without him and co-star Uday Chopra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X