రెండు నిముషాల స్టెప్ కోసం 50 రోజులు

By Srikanya

ముంబై: ఈ నెల 20న విడుదల కానున్న 'ధూమ్‌ 3' సినిమాలో అమీర్‌ ఖాన్‌ మరొకసారి తన అభిమానుల్ని అదరగొట్టాడు. ఈ సినిమాలో కొత్త స్టెప్స్‌ వేసిన అమీర్‌ పాట 'ధూమ్‌ ట్యాప్‌' మంగళవారమే యూట్యూబులో విడుదలై సంచలనం కలిగిస్తోంది. క్లాసిక్‌ ట్యాప్‌ నృత్యం కంటే క్లిష్టమైన ఈ ట్యాప్‌ నృత్యం రీతిని నేర్చుకోవటానికి ఆయన ఆస్ట్రేలియా వెళ్లారు.

ఈ రెండు నిముషాల పాట కోసం ఆయన ఆస్ట్రేలియాకి చెందిన ప్రొఫెషనల్‌ ట్యాప్‌ నృత్యకారుడు డీన్‌ పెర్రీ వద్ద 50 రోజులు శిక్షణ తీసుకున్నారు. ఎంతో ఉత్సాహం చూపించాల్సిన ఈ పాటలో ఆయన వైవిధ్యమైన బౌలర్‌ టోపీ, చేతులు లేని జాకెట్‌ ధరించి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని ట్యాప్‌ స్టెప్పులు వేశారు. 'ధూమ్‌ 3'లో అభిషేక్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, ఉదయ్‌ చోప్రాలు ప్రధాన పాత్రలు పోషించారు.

అమీర్‌ఖాన్, కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన 'ధూమ్ 3' చిత్రం ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్ హక్కుల్ని 'ఈగ' నిర్మాత, వారాహి చలనచిత్రం అధినేత కొర్రపాటి సాయి దక్కించుకున్నారు. ఈ సినిమా పంపిణీ హక్కులకు నెలకొన్న తీవ్ర పోటీలో ఆయన భారీ మొత్తం చెల్లించి ఆ హక్కులను చేజిక్కించుకున్నారు.

నైజాంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ సొంతంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. సాయి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న 'లెజెండ్' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. కాగా 'ధూమ్ 3'లో అమీర్, కట్రీనాపై చిత్రీకరించిన ఓ పాటకు నిర్మాతలు రూ. 5 కోట్లు ఖర్చు చెయ్యడం గమనించదగ్గ అంశం.

ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. . ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌‍ను పురస్కరించుకుని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం. చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X