హైదరాబాద్‌లో ‘ధూమ్-3’ టీం సందడి (ఫోటోలు)
హైదరాబాద్: అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ప్రధాన పాత్రల్లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'ధూమ్-3' చిత్రం ఈ నెల 20 విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో యూనిట్ సభ్యులంతా దేశంలోని ప్రధాన నగరాలు పర్యటిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి కూడా వచ్చి సందడి చేసారు.
ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.
స్లైడ్ సోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

మిస్టర్ పర్‌ఫెక్ట్
మిస్టర్ పర్ ఫెక్టుగా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో కొత్త స్టెప్స్ వేసిన అమీర్ పాట 'ధూమ్ ట్యాప్' ఇప్పటికే యూట్యూబులో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. క్లాసిక్ ట్యాప్ నృత్యం కంటే క్లిష్టమైన ఈ ట్యాప్ నృత్యం రీతిని నేర్చుకోవటానికి ఆయన ఆస్ట్రేలియా వెళ్లివచ్చారు.

ఆస్ట్రేలియాలో శిక్షణ
ఈ రెండు నిముషాల పాట కోసం ఆయన ఆస్ట్రేలియాకి చెందిన ప్రొఫెషనల్ ట్యాప్ నృత్యకారుడు డీన్ పెర్రీ వద్ద 50 రోజులు శిక్షణ తీసుకున్నారు. ఎంతో ఉత్సాహం చూపించాల్సిన ఈ పాటలో ఆయన వైవిధ్యమైన బౌలర్ టోపీ, చేతులు లేని జాకెట్ ధరించి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని ట్యాప్ స్టెప్పులు వేశారు.

తెలుగులో కూడా...
విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్ హక్కుల్ని 'ఈగ' నిర్మాత, వారాహి చలనచిత్రం అధినేత కొర్రపాటి సాయి దక్కించుకున్నారు. నైజాంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ సొంతంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

రికార్డులు బద్దలు కొడుతుందా?
సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొడుతుందనే భారీ అంచనాలు ట్రేడ్ వర్గాల్లో నెలకొంది.


Click it and Unblock the Notifications











