»   » రామ్ చరణ్ కి మధ్యలోనే హ్యాండిచ్చిన సినిమాటో గ్రాఫర్ మరి మిగతా సినిమా ఎవరితో..!??

రామ్ చరణ్ కి మధ్యలోనే హ్యాండిచ్చిన సినిమాటో గ్రాఫర్ మరి మిగతా సినిమా ఎవరితో..!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య బాగా స్లో అయిపోయాడు.నిజంగా టైం బాలేదా లేక తనే ఆచి తూచి అడుగు వేస్తున్నాడో గానీ. బ్రూస్ లీ సినిమా తరవాత చెరణ్ ఏం చేసినా ఆ పని ముందుకు సాగటం లేదు. పోయినేడాది శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన బ్రూస్లీ మెగాస్టార్ ఇచ్చిన బూస్టింగ్ కూడా సరిపోక చతికిల బడటం తో కాస్త డిసప్పాయింట్ అయిన చెర్రీ, కాత టైం తీసుకొని మళ్ళీ సెట్రైట్ అయ్యాడు. కానీ ఆతర్వాత అతని పనులేవీ ముందుకు సాగటం లేదు.

మెగాస్టార్ 150 వ చిత్రానికి నిర్మాత గా కొత్త భాధ్యతని తలకెత్తుకున్నాడు కానీ ఆ సినిమా కూడా నిత్యం ఏదో ఒక అవాంతరం తో వాయిదా పడుతూనే ఉంది. ఆ సినిమాకోసమే తన సినిమాని లేట్ చేసుకున్న చరణ్ ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ "ధృవ" షూటింగ్ కు వెళ్లలేదు. అఫీషియల్ గా సినిమా స్టార్ట్ చేసినా.. ఇతర పాత్రలపై సీన్స్ తీస్తున్నారే గానీ చరణ్ మాత్రం షూటింగ్ లో పాల్గొనటం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఈనెల 6 నుంచి షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడట

ఈ సారి ఎలా అయినా సరే ఒక మాంచి హిట్ కొట్టి తనలోనూ,అభిమానుల్లోనూ ఒక జోష్ తెద్దామనే ఆలోచనలో ఉన్న చెర్రీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ ను రీమేక్ చేస్తున్నాడు. ధృవ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషయన్స్ తో కలిసి పనిచేస్తున్నాడు. ఎక్కడా క్వాలిటీ విశయం లో రాజీ పడటం లేదు. అందుకే బంజరంగీ భాయ్ జాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ కు పనిచేసిన సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా ని ధృవ టీంలో చేర్చుకున్నారు.

"Dhruva" Cameraman Walkout Why from the project

అయితే ఒక టెక్నీషియన్ని తెచ్చుకున్నప్పుడు అతని నుంచి సరైన పని ని రాబట్టుకోవాలన్న విశయం మర్చిపోయి.. వేరే పనుల్లో బిజీ అయిపోయాడు మెగా పవర్ స్టార్ ఇప్పటికే పూర్తయిన తొలి రెండు షెడ్యూళ్లకు సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన మిశ్రా. చరణ్ పాల్గొనబోయే మూడో షెడ్యూల్ నుంచి మాత్రం పనిచేయటం లేదు.

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ నుంచి పిలుపు రావటంతో మిశ్రా, ధృవ సినిమాను మధ్యలోనే వదిలేసి ముంబై వెళ్లిపోయాడట. దీంతో ఇప్పటికిప్పుడు పి.ఎస్. విందాతో మిగతా సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు ధృవ యూనిట్. చరణ్ షూటింగ్ కు రాకుండా ఇలాగే మరింత ఆలస్యం చేస్తూ పోతూంటే యూనిట్ లో మరింత మంది హ్యాండిచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి చెర్రీ ఆలోచనలు ఎలాఉన్నయో ఎవరికీ తెలియటం లేదు...

English summary
The cameraman Asim Mishra have dropped out of the project because of delays and shooting getting cancelled by Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu