రామ్ చరణ్ ‘ధృవ’ పాటులు రిలీజ్... (వినడానికి క్లిక్ చేయండి)
హైదరాబాద్: రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ధృవ' ఆడియో నవంబర్ 9న నేరుగా మార్గెట్లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగానే.... రాత్రి 12 గంటలకు ఆడియో రిలీజ్ చేసారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మరో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. సినిమా చిత్రీకరణతో పాటు సమాంతరంగా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
పాటలు ఈ వీడియోలో వినండి....
‘ధృవ' ఆడియో నవంబర్ 9న నేరుగా మార్గెట్లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగానే.... రాత్రి 12 గంటలకు ఆడియో రిలీజ్ చేసారు.

ఆడియో రిలీజ్ బదులు, ప్రీ రిలీజ్ ఫంక్షన్
ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపటం లేదు కాబట్టి ..సినిమా విడుదలకు ముందు అభిమానులు, ప్రేక్షకుల నడుమ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

డిసెంబర్లో విడుదల
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.

నటీనటులు, టెక్నీషియన్స్
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్- పి.యస్.వినోద్, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











