twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dia Mirza: ’ప్రెగ్నెన్సీ మహిళలు, పిల్లలకు పాలిచే తల్లులు కోవిడ్ వాక్సిన్ చేయించుకోవద్దు!’ కారణం ఏమిటంటే.. ?

    |

    దేశంలో కరోనావైరస్ దాడి విజృంభిస్తున్న సమయంలో ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకొంటూ తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. లక్షలాది మంది పౌరులతోపాటు అనేక మంది సినీ తారలు, ఇతర సెలబ్రిటీలు వ్యాక్సిన్‌పై వేయించుకొంటూ అవగాహన కల్పిస్తున్నారు. అయితే బాలీవుడ్ నటి దియా మిర్జా వ్యాక్సిన్ గురించి ఓ కీలక సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా చేరవేశారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

    దియా మిర్జా గర్బవతిగా

    దియా మిర్జా గర్బవతిగా

    సినీ నటి, హైదరాబాదీ దియా మిర్జా ఇటీవలే వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి రెండో వివాహం చేసుకొన్నారు. గత నెల తాను గర్భవతిని అంటూ అభిమానులు, సన్నిహితులతో పంచుకొన్నారు. కడుపుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తాను కోవిడ్ రాకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలని సంప్రదించగా అందుకు డాక్టర్ నిరాకరించారట.

    గర్బవతులు వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలి..

    గర్బవతులు వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలి..

    అయితే పెగ్నెన్సీ సమయంలో మహిళలు వ్యాక్సిన్ చేయించుకోకూడదు అనే విషయాన్ని చెబుతూ ప్రజలకు ఓ సమాచారాన్ని చేరవేశారు. కేవలం ప్రెగ్నెంట్స్ కాకుండా పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలి. ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

    పాలిచ్చే మాతృమూర్తులకు

    పాలిచ్చే మాతృమూర్తులకు

    తాజా కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దియా మిర్జా ట్వీట్ చేస్తూ.. ప్రెగ్నెంట్, పాలిచ్చే మాతృమూర్తులకు చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రస్తుతం దేశంలో వాడుతున్న వ్యాక్సిన్లను గర్భవతులు, పాలిచ్చే తల్లులపై క్లినికల్ ట్రయల్స్ జరుగలేదు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యేంత వరకు వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవద్దు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అంటూ దియా మిర్జా ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ప్రముఖ గైనకాలజిస్ట్ ఏం చెప్పారంటే

    ప్రముఖ గైనకాలజిస్ట్ ఏం చెప్పారంటే

    ప్రముఖ గైనకాలజిస్టు రుమా సాత్విక్ ట్వీట్‌ను దియా మిర్జా ట్వీట్ చేసింది. కోవిడ్ వైరస్ సమయంలో ప్రెగ్నెంట్ ఉమెన్‌కు ఇన్‌ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. సంతానాభివృద్ది కోసం చేసే ట్రీట్‌మెంట్‌ కోసం ఉపయోగపడే వ్యాక్సిన్లను తప్పకుండా చేయిస్తూ.. ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూసుకోవాలి అంటూ డాక్టర్ రుమా ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    DSP Vs Thaman : ఎవరి పారితోషికం ఎక్కువ? Tollywood లో మ్యూజికల్ రేస్ ! || Filmibeat Telugu
    దియా మిర్జా కెరీర్ ఇలా...

    దియా మిర్జా కెరీర్ ఇలా...

    దియా మిర్జా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల తెలుగులో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. అలాగే గతేడాది తప్పడ్ మూవీలో నటించారు. సంజూ, సలాం ముంబై చిత్రాల్లో మంచి నటనతో గుర్తింపు పొందారు. కాఫీర్, మైండ్ ది మల్హోత్రాస్, మొఘల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

    English summary
    Dia Mirza request pregnant and lactating women to not take Covid19 Vaccine. She wrote on Twitter that, This is really important. Must read and also note that none of the vaccinations currently being used in India have been tested on pregnant and lactating mothers. My doctor says we cannot take these vaccines until required clinical trials have been done.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X