twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ అమ్ముడు పోవడంపై, బన్నీ చెత్తబుట్టలో వేయడంపై... డైమండ్ రత్నబాబు సంచలనం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    Allu Arjun Is Aamir Khan Of Tollywood

    డైమండ్ రత్నబాబు... తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని స్టార్ రైటర్. ఇప్పటి వరకు కామెడీ, ఫన్ ఎంటర్టెన్మెంట్‌ను తన కలం ద్వారా పుట్టించిన ఆయన 'గాయిత్రి' సినిమా ద్వారా తన రచనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. తాజాగా ఆయన ఓ వెబ్ చానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా.... మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, బన్నీ గురించి చెప్పిన విషయాలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. మరి ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం.

     మోహన్ బాబుగారు నాకు గాడ్ ఫాదర్

    మోహన్ బాబుగారు నాకు గాడ్ ఫాదర్

    ‘పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాతో నాకు మోహన్ బాబు గారు పరిచయం అయ్యారు. ఆయన పరిచయం ఇండస్ట్రీలో నా దశ తిరిగేలా చేసింది. ఆయనకు గాడ్ ఫాదర్ లాంటివారు అని డైమండ్ రత్నబాబు తెలిపారు. మోహన్ బాబు గారి బేనర్లో ఏ సినిమా వచ్చినా నాకు అవకాశం తప్పకుంటా ఉంటుందని చెప్పారని ఈ సందర్భంగా రత్నబాబు వెల్లడించారు.

     ఈ సినిమా ద్వారా జనాలకు నా రెండో పేజీ తెలిసింది

    ఈ సినిమా ద్వారా జనాలకు నా రెండో పేజీ తెలిసింది

    గాయిత్రి సినిమాలో శివాజీ అనే క్యారెక్టర్‌కు రెండో పేజీ ఉంటుంది. ఆ రెండో పేజీ అనేది నా రచనకు సంబంధించిన రెండో పేజీ రావడానికి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు డైమండ్ రత్నబాబు అంటే ఎంటర్టెన్మెంట్, కామెడీ బాగా రాస్తారని ముద్రపడింది. నేను రాసిన ఫస్ట్ సినిమా ‘సీమ శాస్త్రి', ఈడో రకం ఆడోరకం కామెడీ చిత్రం, పిల్లా నువ్వేలేని జీవితం ఎంటర్టెన్మెంట్ లవ్ సబ్జెక్టు. ఈ సినిమాల్లో మోస్ట్ ఫన్ ఎస్టాబ్లిష్ అయింది. గాయిత్రి సినిమా ద్వారా డైమండ్ రత్నబాబు అనేవాడు కేవలం ఎంటర్టెన్మెంటే కాదు, ఎలాంటి కథలైనా రాయగలడు, ఎలాంటి మాటలైనా రాయగలడు అనేది ప్రూవ్ చేసుకున్న సినిమా.... అని రత్నబాబు తెలిపారు.

    పదో తరగతి చదివా, పెట్రోలు బంకులో పని చేశాను

    పదో తరగతి చదివా, పెట్రోలు బంకులో పని చేశాను

    గాయిత్రి సినిమాలో డైలాగ్స్ విన్నత తర్వాత చాలా మంది నన్ను అడిగే వారు.... ఈ రామయణ మహాభారతాలు ఎలా తెలుసు అని? వారి క్వశ్చన్ కరెక్టే. ఒక పదో తరగతి చదవిని ఓ కుర్రాడు, ఒక మామూలు రత్నబాబు, ఒక పెట్రోలు బంకులో బాయ్ గా పని చేసిన రత్నబాబుకు... రామాయణ మహాభారతాలు ఎలా తెలిసి ఉంటాయి? అప్పట్లో పుట్టపర్తి సాయి బాబా సంస్థాన్ నుండి బాల విహార్ అని ఉండేది. చిన్నపుడు మమ్మల్ని తీసుకుని వెళ్లి ఆ సంస్థలో మహాభారతం, రామాయణం కథలు, పురాణాలు చెప్పేవారు. సంవత్సరం అయిన తర్వాత ఆ పురాణాల మీద ఎగ్జామ్స్ పెట్టేవారు. చిన్నపుడు మైండ్ లో పడ్డ మాటలు ఇప్పటికీ గుర్తుంటూ ఉంటాయి.... అని రత్నబాబు తెలిపారు.

    ప్రజల కోసం కెరీర్ వదులుకున్న పవన్ కళ్యాణ్‌కు హాట్సాఫ్

    ప్రజల కోసం కెరీర్ వదులుకున్న పవన్ కళ్యాణ్‌కు హాట్సాఫ్

    ‘పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒక ఉన్నతమైన శిఖరం లాంటోడు. ఇపుడు ఆయన వయసు 43 ఏళ్లు. కానీ రజనీకాంత్ 68 ఏళ్లకు రాజకీయాల్లోకి వచ్చారు, కమల్ హాసన్ గారు 64 ఏళ్లకు వచ్చారు. అన్న ఎన్టీఆర్ 58 ఏళ్లకు వచ్చారు. చిరంజీవి గారు 52 ఏళ్లకు వచ్చారు. ఒక వ్యక్తి 43 ఏళ్ల వయసులో తన కెరీర్ వదిలేసి బయటకు వచ్చాడంటే అది పవన్ కళ్యాణ్...ఆయనకు హాట్సాఫ్' అని రత్నబాబు వెల్లడించారు.

     మైత్రి మూవీస్ 40 కోట్ల ఆఫర్ వద్దన్నాడు, పవన్ కళ్యాణ్ గురించి అవి పిచ్చి మాటలే

    మైత్రి మూవీస్ 40 కోట్ల ఆఫర్ వద్దన్నాడు, పవన్ కళ్యాణ్ గురించి అవి పిచ్చి మాటలే

    ‘చాలా మంది పవన్ కళ్యాణ్ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇతను వారికి అమ్ముడు పోయాడు, ఈ రాష్ట్రంలో ఇక్కడ అమ్ముడు పోయాడు అని అంటుంటారు. వారికి అసలు అర్థం కాని విషయం ఏమిటంటే అతడు ఒక 10 సినిమాలు చేస్తారు. సినిమాకో 20 కోట్లో, 30 కోట్ల వస్తాయి. మొన్న మైత్రి మూవీస్ 40 కోట్లు ఆఫర్ చేసింది. ఇది మొత్తం లెక్కలేస్తే ఓ 10 సినిమాలు చేస్తే 300 కోట్లు వస్తాయి. ఇలా అమ్ముడు పోయే బదులు యాడ్స్ చేస్తే ఎన్నో వేల కోట్లు వస్తాయి. అయినా ఆయనకు అమ్ముడు పోవాల్సిన అవసరం ఏముంది.... అని రత్నబాబు వెల్లడిచారు.

     ఒక సినిమా వాడిగా పవన్ కళ్యాణ్‌కు సపోర్టు చేస్తాను

    ఒక సినిమా వాడిగా పవన్ కళ్యాణ్‌కు సపోర్టు చేస్తాను

    మీరు అనుకోవచ్చు ఈయనేంటి పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి మాట్లాడుతున్నాడు అని. ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నానంటే ఆయన ఫస్ట్ సినిమా వాడు, నేను బేసిగ్గా సినిమావాన్ని, ఒక సినిమా వాడు రాజకీయాల్లోకి వచ్చినపుడు సపోర్టు చేస్తాను. అన్న ఎన్టీఆర్ వచ్చినపుడు అందరు సినిమా వాళ్లు సపోర్టు చేశారు. ఇపుడు పవన్ కళ్యాణ్ వచ్చినపుడు ఒక సినిమా వాడిగా సపోర్టు చేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా సినిమా వాళ్ల సపోర్టు కూడా ఉంటుంది. ఒక వేళ నేను తమిళియన్ అయుండి తమిళనాడులో రైటర్ అయి ఉంటే తప్పకుండా రజనీకాంత్ కో, కమల్ హాసన్ కో సపోర్టు చేసే వాడిని... అని డైమండ్ రత్నబాబు తెలిపారు.

     పవన్ కళ్యాణ్ కోసం ‘ప్రైవేట్ సీఎం' కథ

    పవన్ కళ్యాణ్ కోసం ‘ప్రైవేట్ సీఎం' కథ

    పవన్ కళ్యాణ్ కోసం కథ రాశాను. ‘ప్రైవేట్ సీఎం' అనేది టైటిల్. ఆయన ఇపుడు సినిమాలకు దూరం అయ్యారు. మళ్లీ ఆయన సినిమాల్లోకి వస్తే ఆయనకు చెబుతాను. లేకపోతే ఆ కథ వేరే ఎవరికైనా చెప్పాల్సి వస్తుంది. ఇది సామాజిక బాధ్యత ఉన్న సినిమా..... అని డైమండ్ రత్నబాబు తెలిపారు.

    డబ్బున్న ప్రతివాడూ హీరో కాలేడు

    డబ్బున్న ప్రతివాడూ హీరో కాలేడు

    డబ్బు ఉన్నోడు హీరో అవుతాడు అంటే మనం సమర్ధించలేం. దాసరి నారాయణరావు కొడుకు కానీ, రాఘవేంద్రరావుగారి అబ్బాయి ఇలా చాలా మంది హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫెయిలయ్యారు. డబ్బు ఉంటే కాలేరు, టాలెంటు ఉంటేనే అవుతారు. ఇపుడు బన్నీగారు ఉన్నారు... రోజు 18 గంటల్లో ఒక కథ వింటాడు, ఎక్సర్ సైజ్ చేస్తాడు, డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు, సినిమాలు చేస్తాడు. అలాగే జూ ఎన్టీఆర్ కూడా. డబ్బుంటే, బ్యాగ్రౌండ్ ఉంటే హీరోలుగా చెలామని అవుతాడు అనేది అవాస్తవం. ఫ్యామిలీ బ్యాక్ డ్రాపుల మీద కూడా ఒక కథ రాశాను. దీనికి ఎవరైనా హీరో దొరికితే చేస్తాను.... అని రత్నబాబు తెలిపారు.

     త్వరలో దర్శకత్వం చేస్తాను

    త్వరలో దర్శకత్వం చేస్తాను

    త్వరలో దర్శకత్వంలోకి వస్తాను. అయితే తొందరపడి ఏదో ఒక హీరోతో చేయవద్దని చాలా మంది చెప్పారు. ఇపుడున్న హీరోలంతా రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వారి డేట్స్ దొరకక పోవడం వల్లనే నా దర్శకత్వం కూడా లేటవుతోంది.... అని రత్నబాబు తెలిపారు.

     ‘బుర్రకథ' సినిమా కథతో వస్తా

    ‘బుర్రకథ' సినిమా కథతో వస్తా

    నేను చేయబోయే సినిమా పేరు ‘బుర్రకథ'.... బుర్రకథ అంటే పాతకాలం నాటి హరికథో, బుర్రకథో కాదు. ‘ర' అనే అక్షరంలో బ్రెయిన్ సింబల్ ఉంటుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ లాంటి కథ అది. దానికి ఏ హీరో దొరుకుతాడు అనేది ఇంకా తెలియదు. డైరెక్షన్ అంటే ఈజీ అనుకున్నాను. కానీ కాదు. ఒక హీరోతో కథ ఒకే చేయించడం చాలా ఈజీ. కానీ ప్రాజెక్టును తెరమీదకు తీసుకురావడం చాలా కష్టం... అని రత్నాబాబుతెలిపారు.

    బన్నీకి కథ చెబితే చెత్తబుట్టలో పడేయమన్నాడు

    బన్నీకి కథ చెబితే చెత్తబుట్టలో పడేయమన్నాడు

    బన్నీ... టాలీవుడ్ అమీర్ ఖాన్. ప్రతి సినిమాకు తనకు ఒక గెటప్ కావాలి, కథ కావాలి. నా ఆలోచన విధానాన్ని మార్చిందే బన్నీ. ఒక సారి నేను వెళ్లి కథ చెబితే తీసుకెళ్లి డస్ట్ బిన్లో పడేసేయ్ అన్నారు. ఇలా చెప్పడానికి చాలా మంది డైరెక్టర్లు ఎన్నారు. దాంతో ఎవడీ డైమండ్ రత్నబాబు అని కాలర్ గట్టిగా పట్టుకుని అడిగినట్లు అనిపించింది. అప్పటి నుండే నాలో మార్పు అనేది మొదలైంది. బుర్ర కథ అనేది ఆయనకే రాశాను.... అని రత్నబాబు తెలిపారు.

    English summary
    Tollywood Dialogue Writer Diamond Ratna Babu inteesting comments about Mohan Babu, Pawan Kalyan and Allu Arjun.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X