twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC15: ఒకప్పుడు శంకర్ తో ఫొటోకోసం ఆరాటం.. ఇప్పుడు ఏకంగా సినిమా ఛాన్స్: RRR రైటర్

    |

    బాహుబలి అనంతరం పాన్ ఇండియా సినిమాల రూపాలే మారిపోయాయి. గతంలో ఎప్పుడు లేని అగ్ర హీరోలు నెవర్ బిఫోర్ అనేలా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక రామ్ చరణ్ RRR అనంతరం శంకర్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కోసం టాలీవుడ్ టాప్ రైటర్ ను సెట్ చేసుకున్నారు. ఆ రైటర్ సోషల్ మీడియా ద్వారా ఒక అభిమానిలా స్పందించాడు.

    ఆ సినిమాకు సీక్వెల్..

    ఆ సినిమాకు సీక్వెల్..

    రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ అనగానే పాన్ ఇండియా అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మంచి సందేశంతో తెరకెక్కుతున్నట్లు టాక్ వచ్చింది. అంతే కాకుండా అర్జున్ ఒకే ఒక్కడు కథకు సీక్వెల్ అని కూడా కథనాలు వచ్చాయి. వార్తలు ఎన్ని వస్తున్నా కూడా శంకర్ పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు.

    తెలుగు రైటర్ చేత డైలాగ్స్

    తెలుగు రైటర్ చేత డైలాగ్స్

    ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో మొదటిసారి శంకర్ చేస్తున్న సినిమా కావడం..అందులో రామ్ చరణ్ హీరోగా చేస్తుండడంతో సినిమా సెట్స్ పైకి రాకముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ను తనదైన శైలిలో వాడుకునే శంకర్ ఈసారి తెలుగు రైటర్ ను డైలాగ్స్ రాయడం కోసం సెలెక్ట్ చేసుకున్నాడు.

    సాయి మాధవ్ ఫిక్స్..

    సాయి మాధవ్ ఫిక్స్..

    ఆయన మరెవరో కాదు. RRR సినిమాకు అద్భుతమైన డైలాగ్స్ రాసినటువంటి సాయి మాధవ్ బుర్ర. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు కూడా ఆయనే మాటలు రాస్తున్నారు. ఇక శంకర్.. వెంటనే మరో ఆలోచన లేకుండా సాయి మాధవ్ ను ఫైనల్ చేసుకున్నారు.

    అభిమానిలా స్పందించిన సాయి మాధవ్

    అభిమానిలా స్పందించిన సాయి మాధవ్

    ఇక సోషల్ మీడియా ద్వారా స్పందించిన సాయి మాధవ్ శంకర్ తో దిగిన ఫొటోను షేర్ చేసుకున్నారు. జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను.. అంటూ దర్శకుడికి నిర్మాతకు అలాగే హీరో రామ్ చరణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరి సినిమాలో ఆయన ఎలాంటి డైలాగ్స్ రాస్తారో చూడాలి.

    English summary
    Shankar’s film with Ram Charan has begun the pre-production work.He is now busy finalizing d script.The Telugu dialogue will be penned Popular writer SaiMadhavBurra. He thanked Ram Charan, Shankar, and Dil Raju for giving him this opportunity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X