గ్రాండ్‌మస్తీ: అంతా సెక్స్ యావే, కామెడీటచ్(పిక్చర్స్)
ముంబై: భారతీయ సమాజంలో 'సెక్స్' గురించి మాట్లాడటానికి అంతగా ఇష్ట పడరు. సెక్స్ గురించి మాట్లాడటం పెద్ద తప్పుగా భావిస్తారు చాలా మంది. అయితే చాలా మంది స్నేహితుల దగ్గర ఇలాంటి విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్లో ఇటీవల విడుదలైన చిత్రం 'గ్రాండ్ మస్తీ'. పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈచిత్రం పూర్తిగా సెక్స్ రిలేటెడ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడి ఉంది. అడల్ట్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం తెగ ఎంటర్టెన్ చేస్తోంది. సెన్సార్ కట్స్ లేక పోవడంతో కొన్ని సీన్లు తీవ్రమైన అభ్యంతరకంగా ఉన్నాయి.
ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇంగ్లీష్ అడల్ట్ కామెడీ చిత్రాలను ఇన్స్‌స్పిరేషన్‌గా తెరకెక్కించినట్లు స్పష్టం అవుతోంది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, రితేష్ దేష్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని, మంజరి, కరిష్మా తన్నా, మరియమ్ జకారియా, బ్రూనా అబ్దుల్లా, కైనత్ అరోరా, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సినిమా కథ విషయానికొస్తే....ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇంట్లో భార్యలతో సంసార సుఖం లేని వారు.....ఎలాంటి అడ్డదారులు తొక్కారు, ఇబ్బందుల్లో ఇరుక్కుని ఎలా బయట పడ్డారు అనేది స్టోరీ. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఏ రేంజిలో ఉన్నాయో స్లైడ్ షోలో చూడండి.

గ్రాండ్ మస్తీ
నాకు రెండు పెద్ద పెద్ద పాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈరోజు రాత్రి నీకు వాటిని చూపిస్తాను. ఇందులో ఎంత డబుల్ మీనింగ్ ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది.(వివేక్ ఒబెరాయ్‌ని రాత్రి తన గదికి పిలిచే సందర్భంలో కైనత్ అరోరా ఈ డైలాగ్ చెబుతుంది)

రితేష్ దేశ్ ముఖ్ డైలాగ్
నువ్వు బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి నాకు సరిగా పడక సుఖం ఇవ్వడం లేదంటూ తన భార్యపై అసహం వ్యక్తం చేస్తాడు రితేష్.

రితేష్ వల్గర్ డైలాగ్
కోరిక ఆగడం లేదు....ఈ రోజు రాత్రి నేను నిరోద్‌కు విరోధి కాదల్చుకోలేదు అంటూ రితేష్ దేశ్ ముఖ్ తన భార్యతో చెప్పే డైలాగ్ ఇది.

కండోమ్ రిలేటెడ్ జోక్స్
ఈ చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్ డాక్టర్. ఓ పేషెంట్ లైంగిక సమస్యకు కండోమ్ ప్యాకెట్ ఇచ్చి వాడమని సలహా ఇస్తాడు. దాన్ని మందుగా భావించిన పేషెంట్....ఇది పాలతో వేసుకోవాలా? నీళ్లతో వేసుకోవాలా? అని అతన్ని అడుగుతుంది. ఈ జోక్ థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తోంది.

అడల్డ్ డైలాగ్స్
సినిమా మొత్తం డబుల్ మీనింగ్, వల్గర్ డైలాగులతో నిండి ఉండి. అడల్డ్ కామెడీ ఇష్టపడే వారికి ఒకే కానీ....అలాంటి నచ్చని వారు సినిమాకు వెళ్లక పోవడమే బెటర్.

వివాదాస్పద డైలాగులు
పైన పటారం...లోన లొటారం.....అంటూ అతను లైంగిక శక్తిలో వీక్ అంటూ పరిహాసం చేసే డైలాగు ఇది. ఇలాంటి డైలాగులు సినిమాలో బోలెడు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











