డేట్ ఖారారు: ఏపీ రాజధానిలో ‘డిక్టేటర్’ ఆడియో వేడుక

By Bojja Kumar

హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిక్టేటర్' మూవీ ఆడియో రిలీజ్ డేట్ ఖారైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 20న ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కొత్తరాజధాని అమరావతిలో ఆడియో వేడుక జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

'డిక్టేటర్‌' జనవరి 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సంక్రాతికి రావాల్సిన ఎన్టీఆర్ తన చిత్రం 'నాన్నకు ప్రేమతో' ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. తన బాబాయ్ చిత్రం వస్తున్నప్పుడు తను పోటీకి రావటం ఎందుకనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ వెనకడుగు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏదీ లేదు.

Dictator audio releasing on Dec 20

డిక్టేటర్ లో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశారు. 'రైడ్', 'కందిరీగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచన: కోన వెంకట్, గోపీ మోహన్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X