»   » ముమైత్ ఖాన్ కొరుకుతూ బాలయ్య...(ఫొటోలు)

ముమైత్ ఖాన్ కొరుకుతూ బాలయ్య...(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్యతో వర్క్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటుంది. ఆయన చాలా సరదాగా సెట్స్ లో ఉంటూంటారని ఆయనతో పనిచేసే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ చెప్తూంటారు. ఇక పంక్షన్స్ లో అయిన ఆయన తీరే వేరు. షూటింగ్ గ్యాప్ లో కూడా బాలకృష్ణ చాలా సరదాగా చిన్నపిల్లాడిలా అందరితో కలిసిపోతూంటారు. అలాగే రీసెంట్ గా ముమైత్ ఖాన్ తో పనిచేసిన బాలకృష్ణ చాలా సరదాగా ఆమెతో ఉన్నారు. అందుకు సాక్ష్యం క్రింద ఫొటోలు.

ముమైత్ ఈ పాట పూర్తైన తర్వాత ట్వీట్ చేస్తూ...ఓ అద్బుతమైన హ్యూమన్ బీయింతో పనిచేసానని, ఎమేజింగ్ పర్శనాలిటి అని బాలకృష్ణ గురించి రాసుకొచ్చింది. ఆయనతో పనిచేయటం తన అదృష్టమని అంది.

ఈ చిత్రంలో ‘టింగొ టింగొ' అనే ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ పాట కోసం ముమైత్‌ఖాన్‌ని ఎంచుకొన్నారు. బుధవారం నుంచి హైదరాబాద్‌లో బాలకృష్ణ - ముమైత్‌ఖాన్‌ల మధ్య ఈ పాటని తెరకెక్కించారు. దాంతో షూటింగ్ పూర్తయినట్టే. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. సంక్రాంతికి ‘డిక్టేటర్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

బాలకృష్ణ డిక్టేటర్ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం చాలామందిని వెతికారు. అందుతో ఇలియాన, నయనతార, శ్రద్దా దాస్ లాంటి పేర్లు వినపడ్డాయి. కాని చివరకు ఆ అవకాశం, గతంలో టాలీవుడ్ ని షేక్ చేసిన ముమైత్ ఖాన్ ని ఎంచుకున్నారు.

ఇప్పటికీ యంగ్..

ఇప్పటికీ యంగ్..

పదేళ్ల క్రితం ముమైత్ ఎలా ఉందో ..ఇప్పటికే అదే చురుకుతనంతో ఉందని అంటున్నారు యూనిట్.

ఫామ్ లోకి..

ఫామ్ లోకి..

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వస్తుందనకుంటున్నారు సినీ వర్గాలు.

అప్పట్లో...

అప్పట్లో...

చాలా కాలం క్రితం మహేష్ బాబు చిత్రం పోకిరిలో 'ఇప్పటికింకా నావయసు నిండా పదహారే' తో చేలరేగిన ఈ భామ, ప్రభాస్ తో కూడా ఆడి పాడింది యోగి సినిమాలో 'ఓరోరి యోగి నన్ను కోరికెయ్ రో' అంటూ సాగిన ఈపాట కుర్రకారును ఉర్రూతలూగించింది.

ప్రత్యేక సందర్బంలో

ప్రత్యేక సందర్బంలో

సినిమా సెకండాఫ్ లో ఈ పాట ఓ ప్రత్యేక సందర్బంగా వస్తుందని చెప్తున్నారు. ఈ పాట హైలెట్ అవుతుందని చెప్తున్నారు.

జోష్

జోష్


బాలకృష్ణ చాలా జోష్ గా ఈ పాటలో డాన్స్ చేసి మెప్పించాడని వినికిడి. ఈ పాట లో బాలయ్య స్టెప్స్ అదుర్స్ అంటున్నారు.

కావాలనే

కావాలనే

చాలా మందిని ఈ పాట కోసం అనుకున్నా ...ముమైత్ ఖాన్ స్టెప్స్ కు సాటి రారని ప్రత్యేకంగా రప్పించినట్లు సమాచారం.

బాలయ్యే సజెషన్

బాలయ్యే సజెషన్

ఈ పాట కోసం బాలయ్యే ఆమెను సజెస్ట్ చేసి రప్పించారని సమాచారం.

100 వ చిత్రంలోనూ

100 వ చిత్రంలోనూ


ఈ పాట ఎంతలా జనాల్లోకి వెళ్తుందనేదాన్ని బట్టి బాలకృష్ణ వందవ చిత్రంలోనూ ఆమెను తీసుకుంటారు.

English summary
Mumait Khan tweeted: Working with this fantastic human being and amazing personality for his 99th movie "DICTATOR".
Please Wait while comments are loading...