»   » మహాగణపతి సన్నిధిలో ‘డిక్టేటర్’ సాంగ్ రిలీజ్ (ఫోటోస్)

మహాగణపతి సన్నిధిలో ‘డిక్టేటర్’ సాంగ్ రిలీజ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ‘డిక్టేటర్'అనే భారీ చిత్రాన్ని నిర్మింస్తున్న సంగతి తెలిసిందే. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలోని సాంగును వినాయక చవితి పర్వదినాన ఖైరతాబాద్ మహాగణపతి సన్నిధిలో విడుదల చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

ఈ సినిమాను జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. రీసెంట్ గా బాలకృష్ణపై హైదరాబాద్ లో ఇంట్రడక్షన్ సాంగ్ తీసారు. ఈ చిత్రంలో బాలకృష్ణని శ్రీవాస్‌ సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు. బాలయ్య పలికే సంభాషణలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచబోతున్నాయి.


తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.


ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.


సాంగ్ రిలీజ్
  

సాంగ్ రిలీజ్


ఖైరతాబాద్ గణేషుడి సమక్షంలో సాంగ్ రిలీజ్ చేస్తున్న బాలయ్య, అంజలి, శ్రీవాస్ తదితరులు.


అంజలి
  

అంజలి

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సాంగ్ రిలీజ్ సందర్భంగా అంజలి ఆనందం.


బాలయ్య
  

బాలయ్య

సాంగ్ రిలీజ్ సందర్భంగా తొలి సీడీని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి అందజేస్తున్న బాలయ్య.


భక్తజనం
  

భక్తజనం

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద భక్తజన సందోహం.


అభిమానులు
  

అభిమానులు

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద బాలయ్య అభిమాని కరచాలనం.


 


 


Please Wait while comments are loading...