twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టైలిష్ లుక్ విత్ సిగ్నేచర్ తో బాలయ్య (ఫొటో)

    By Srikanya
    |

    హైదారాబాదు: నందమూరి బాలకృష్ణ తన అభిమామనులకు, శ్రేయోభిలాషులకు అడ్వాన్స్ గా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఫేస్ బుక్ ద్వారా తెలియజేసారు. ఈ మేరకు తన కోత్త సినిమాలో స్టైలిస్ పిక్ ని షేర్ చేసారు. ఆ పోష్టర్ ని ఇక్కడ చూడండి.

    తెలుగు వారందరికి విజయ దశమి మరియు దీపావళి శుభాకాంక్షలు...మీ నందమూరి బాలకృష్ణ

    Posted by Nandamuri Balakrishna on 17 October 2015

    'డిక్టేటర్‌' చిత్ర విశేషాలు.

    లక్ష్యం,లౌక్యం చిత్రాల హిట్ దర్శకుడు శ్రీవాస్‌ తాజాగా డైరక్ట్ చేస్తున్న త్రం 'డిక్టేటర్‌'. నందమూరి బాలకృష్ణ హీరో. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. వేదాశ్వ క్రియేషన్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ రూపొందిస్తున్నాయి. 'డిక్టేటర్‌'లో దాదాపు సగభాగం యూరప్‌ నేపథ్యంలోనే సాగుతుంది. పాటలూ, పోరాట ఘట్టాలనీ అక్కడే తెరకెక్కించారు. వినాయిక చవితి సందర్బంగా దర్శకుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి దర్శకుడు మాట్లాడుతూ... అతని మాటెప్పుడూ బాణంలా దూసుకుపోతుంది. అది చట్టంలా నిలిచిపోతుంది. శాసనంగా మిగిలిపోతుంది. అతడే.. 'డిక్టేటర్‌'. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన అసలు సిసలైన నాయకుణ్ని మా సినిమాలో చూడండి అంటున్నారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా పేరు చాలా బలమైనది. అందుకు తగ్గట్టుగానే కథని తయారు చేశారు. ఇంతకు ముందున్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. మంచి కథకి, మంచి నటీనటులు, సాంకేతికబృందం తోడైంది. గత చిత్రాల్లాగే ఇదీ మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుంది''అన్నారు.

    Dictetor-Balakrishna wishes to fans

    దర్శకుడు మాట్లాడుతూ '''డిక్టేటర్‌' పేరులో ఎంత శక్తి ఉందో అంతే శక్తి బాలకృష్ణ పాత్రలోనూ ఉంటుంది. ఆయన్ని చాలా స్త్టెలిష్‌గా, అభిమానులు మెచ్చేలా చూపించబోతున్నా''మన్నారు. అలాగే... ''విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. భావోద్వేగాలు, యాక్షన్‌, వినోదం సమపాళ్లల్లో కుదిరాయి. బాలకృష్ణ తెరపై స్త్టెలిష్‌ పాత్రలో కనిపించబోతున్నార''న్నారు.

    ఎరోస్‌ ఎండీ సునీల్‌ లుల్లా మాట్లాడుతూ ''తెలుగు నుంచి మంచి సినిమాలొస్తున్న తరుణంలో మా సంస్థ పరిశ్రమలో భాగం కావడం ఆనందంగా ఉంది. 'డిక్టేటర్‌' అందరినీ మెప్పించే సినిమా అవుతుంది. బాలకృష్ణ సినిమా ప్రయాణంలో మరిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది'' అన్నారు.

    తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.

    ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

    English summary
    Balakrishna Facebook page reads, " Telugu Varandariki Vijaya Dasami mariyu Deepawali Subhakanshalu.... Me Nandamuri Balakrishna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X