‘సీక్రెట్ సూపర్‌స్టార్’ అమీర్‌ఖాన్ తప్పు చేశాడా?.. పప్పులో కాలేసిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్

బాలీవుడ్‌లో పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేసుకోవడంలో గతకొద్దికాలంగా అమీర్‌ఖాన్, అజయ్ దేవగణ్ మధ్య గట్టి యుద్దమే జరుగున్నది. అయితే ఇద్దరి మధ్య పోటీలో ఎక్కువ సార్లు అమీర్‌ఖాన్ విజయం సాధించారు. కానీ సీక్రెట

By Rajababu

బాలీవుడ్‌లో పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేసుకోవడంలో గతకొద్దికాలంగా అమీర్‌ఖాన్, అజయ్ దేవగణ్ మధ్య గట్టి యుద్దమే జరుగున్నది. ఒకే రోజు సినిమాలను రిలీజ్ చేసుకొని నువ్వా నేనా అనే విధంగా వ్యవహరించారు. అయితే ఇద్దరి మధ్య పోటీలో ఎక్కువ సార్లు అమీర్‌ఖాన్ విజయం సాధించారు. కానీ సీక్రెట్ సూపర్‌స్టార్ విషయంలో ఈ సారి అమీర్ ఓడినట్టే కనిపిస్తున్నాడు. ఎందుకంటే..

దీపావళీ రోజు రిలీజా?

దీపావళీ రోజు రిలీజా?

దీపావళీ పండుగ రోజు జాతీయ సెలవుదినం. సినీ ప్రేక్షకులు దీపావళీని బ్రహ్మండంగా జరుపుకొంటారు. సాయంత్రం లక్ష్మీ పూజ, టాపాసులు కాల్చడంలో బిజీగా ఉంటారు. అలాంటి రోజున గురువారమే సీక్రెట్ సూపర్‌స్టార్‌ను అమీర్ రిలీజ్ చేశాడు. పండుగ రోజు సినిమాను అమీర్ రిలీజ్ చేయడమేంటనే వాదన కూడా వినిపించింది.

చాకచక్యంగా అజయ్ దేవగణ్

కానీ అజయ్ దేవగణ్ మాత్రం గోల్‌మాల్ రిలీజ్ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. పండుగ రోజు కాకుండా శుక్రవారం రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. దాంతో శుక్రవారం గోల్‌మాల్ రిటర్న్ సినిమా హాళ్ల ఎదుట చేంతాడంతా క్యూ. మార్నింగ్‌లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. సినిమాకు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

దీపావళీ రోజు బిజినెస్ డల్‌గా

దీపావళీ రోజు బిజినెస్ డల్‌గా

సాధారణంగా దీపావళీ రోజు బిజినెస్ చాలా డల్‌గా ఉంటుంది. అలాంటి రోజున సీక్రెట్ సూపర్‌స్టార్ రిలీజ్ చేయడంపై బాలీవుడ్లో పలువురు కనుబొమ్మలు ముడిపడ్డాయి. రిలీజ్ విషయంలో అమీర్ తప్పు చేశాడా అనే భావనను వ్యక్తం చేస్తున్నారు అని తరణ్ ఆదర్శ్ మరో ట్వీట్ చేశాడు.

సీక్రెట్ సూపర్‌స్టార్‌కు మంచి రెస్పాన్స్

సీక్రెట్ సూపర్‌స్టార్‌కు మంచి రెస్పాన్స్

ఇక ముంబైలో సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా ప్రిమియర్‌ను మీడియాకు మంగళవారమే ప్రదర్శించాడు. బుధవారం మధ్యాహ్నం కల్లా అన్ని మీడియా వెబ్‌సైట్లలో సీక్రెట్ సూపర్‌స్టార్ బ్రహ్మండంగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి.

అతివిశ్వాసంతో అమీర్

అతివిశ్వాసంతో అమీర్

సీక్రెట్ సూపర్‌స్టార్ కంటెంట్ చాలా బాగా ఉంది అనే అతివిశ్వాసం అమీర్ కలగడం కారణంతోనే సినిమాను రిలీజ్ చేసి ఉండవచ్చు. ఎలాగూ పాజిటివ్ టాక్ వస్తే అజయ్ దేవగణ్‌కు ముచ్చెమటలు పట్టించవచ్చు అనే ఫీలింగ్‌తో రిలీజ్ చేసి ఉండవచ్చు. కానీ అమీర్ స్ట్రాటెజీ ఈసారి దెబ్బేసిందా అనే టాక్ వినిపిస్తున్నది.

రిలీజైన స్క్రీన్ల కౌంట్ ఇదే..

రిలీజైన స్క్రీన్ల కౌంట్ ఇదే..

స్వదేశంలో గోల్‌మాల్ అగైన్ చిత్రం 3500 స్క్రీన్లలో విడుదల కాగా, సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం 1750 స్క్రీన్లలో రిలీజ్ అయింది. సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం బడ్జెట్ అడ్వర్టయిజింగ్ ఖర్చులతో కలిపి సుమారు 40 కోట్లు. గోల్ మాల్ అగైన్‌తో పోల్చుకొంటే ఇది చాలా తక్కువ మొత్తం.

ఓవర్సీస్ మార్కెట్‌లో

ఓవర్సీస్ మార్కెట్‌లో

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాన్ని అమీర్ ఖాన్ 1090 స్క్రీన్లలో రిలీజ్ చేశాడు. గోల్ మాల్ అగైన్ చిత్రం ఓవర్సీల్ 732 స్క్రీన్లకే పరిమితమైంది. సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రానికి నిర్మాతగా అమీర్ ఖాన్, కిరణ్‌రావు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X