»   » భార్యపై ఎఫైర్ రూమర్స్, సల్మాన్ సోదరుడు ఫైర్!

భార్యపై ఎఫైర్ రూమర్స్, సల్మాన్ సోదరుడు ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. అర్బాజ్ ఖాన్, ఆయన భార్య మలైకా అరోరా విడాకులు తీసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు మలైకా అరోరా వేరొకరితో డేటింగ్ చేస్తుందనే వార్తలు కూడా ప్రచారంలో ఉండటం గమనార్హం.

మలైకా అరోరా యూకెకు చెందిన వ్యక్తితో డేటింగ్ చేస్తోందనే వార్తలు ఓ వైపు....బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ తో మలైకా ఎఫైర్ కలిగి ఉందని మరో వైపు రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు సరైన ఆధారాలు లేక పోయినా ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది.

అర్జున్ కపూర్, మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్....సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. చాలా కాలంగా ఈ రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ రూమర్స్ ఆల్రెడీ వారి చెవిన పడే ఉంటాయి. అయితే ఈ ముగ్గురిలో ఎవరూ కూడా ఈ విషయమై క్లారిటీ ఇవ్వక పోవడం గమనార్హం.

చాలా గ్యాప్ తర్వాత అర్బాజ్ ఖాన్...మీడియాకు ఈ గాసిప్స్ పై డబ్‌స్మాష్ ద్వారా జవాబు ఇచ్చారు. ‘కుచ్ తో లోగ్ కహెగా' అంటూ ఓ పాట పాడారు. ఈ వీడియోకు ‘కొంతమంది పీపుల్ వారి వారి పనులు చూసుకుంటే మంచిది. చెత్త మాటలు మాట్లాడటం, రాయడం మానుకోవాలి. వారి వారి నికృష్ణ జీవితాలపై దృష్టి సారిస్తే మంచింది' అనే కామెంట్ పెట్టాడు. అయితే ఆయన కామెంట్లలో ఎక్కడా కూడా ఈ రూమర్లను ఖండించిన దాఖలాలు లేక పోవడం గమనార్హం. మొత్తానికి తన భార్యపై వస్తున్న రూమర్లపై అర్బాజ్ ఖాన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది.

స్లైడ్ షోలో ఫోటోస్...

వెడ్డింగ్ పిక్
  

వెడ్డింగ్ పిక్

అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ ఫోటో...

అర్జున్ కపూర్..
  

అర్జున్ కపూర్..

ఓ ఫ్యాషన్ షోలో అర్జున్ కపూర్ తో కలిసి మలైకా అరోరా...

దుబాయ్ లో బర్త్ డే...

తన భార్య బర్త్ డేను దుబాయ్ లో సెలబ్రేట్ చేసాడు అర్బాజ్.

కొడుకుతో..
  

కొడుకుతో..

మలైకా, అర్బాజ్ ఖాన్ లకు ఒక కుమారుడు ఉన్నాడు.

హ్యాపీ మూమెంట్స్
  

హ్యాపీ మూమెంట్స్

అర్బాజ్, మలైకా పెళ్లి సెలబ్రేషన్స్ నాటి ఫోటో...

 

 

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu