»   »  ..రాంబాబు కలెక్షన్స్ 52 కోట్లా లేక 21 కోట్లా!?

..రాంబాబు కలెక్షన్స్ 52 కోట్లా లేక 21 కోట్లా!?

By Srinivas
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాపై వివాదాల ప్రభావం పడిందా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ...రాంబాబు చిత్రంపై రాజకీయ వివాదాల ప్రభావం ఏమాత్రం పడలేదని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. జాతీయ ఛానల్ ఎన్డీటివితో పాటు పలు వెబ్‌సైట్లలో ..రాంబాబు చిత్రం కలెక్షన్స్ రూ.52 కోట్లు అని వచ్చాయి.

    ఈ చిత్రం ఈ నెల 18వ తేదిన విడుదలైంది. మొదటి వారమే రూ.52 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. సాధారణంగా పవన్ కల్యాణ్ సినిమా అంటేనే ఓ క్రేజ్. ..రాంబాబు చిత్రం మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండో రోజు నుండి ఆ కలెక్షన్స్ పైన తెలంగాణ ప్రభావం పడిందని చెబుతున్నారు.

    ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉందని ఆరోపిస్తూ తెలంగాణవాదులు, టిఆర్ఎస్ పార్టీ ...రాంబాబు చిత్రాన్ని అడ్డకుంది. దీంతో ఓ రెండుమూడు రోజులు ఆ చిత్రంపై ప్రభావం పడింది. ఆ తర్వాత ప్రభుత్వం సూచించిన కట్స్‌తో తిరిగి తెలంగాణ థియేటర్లలలో ప్రదర్శన ప్రారంభించారు. కట్స్‌తో ప్రదర్శకు ఓకె చెప్పడంతో ఇక తెలంగాణ జిల్లాల్లోనూ పవన్ హవా కొనసాగనుంది. పవన్‌కు తెలంగాణలో కూడా మంచిచి క్రేజ్ ఉంది.

    ..రాంబాబు చిత్రం రూ.52 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నప్పటికీ మరో మాట కూడా వినిపిస్తోంది. ..రాంబాబు చిత్రం కేవలం రూ.21 కోట్లు మాత్రమే వసూళ్లు చేసి ఉండవచ్చుననే టాక్ వస్తోంది. స్థానికంగా వచ్చిన సమాచారం మేరకు.. బాగా కలెక్షన్స్ వచ్చే నైజాం, సీడెడ్ ఏరియాలో ఈ చిత్రంపై ప్రభావం పడిందని, దీంతో ఇక్కడ ఎక్కువ కలెక్షన్ రాలేదని చెబుతున్నారు.

    నైజాం, సీడెడ్ ప్రాంతాల నుండే కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకోవైపు సినిమా విడుదలై వారం కాకముందే ఆదర్శ్ ..రాంబాబు చిత్రం ఈ వారంలో ఓవర్సీస్‌లో రూ.1.86 కోట్లూ వసూలు చేసిందని ట్వీట్ చేశారట. వారం పూర్తి కాకముందే ఎలా ట్వీట్ చేశారని అంటున్నారు.

    అక్కడ కలెక్షన్స్ పడిపోవడంతో ...రాంబాబు చిత్రం కలెక్షన్స్ రూ.52 కోట్లు కలెక్ట్ చేయకపోయి ఉండవచ్చునని చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని.. అదంతా వట్టిదేనని, చిత్రం కలెక్షన్స్ బాగానే ఉన్నాయని, ముందు ముందు కలెక్షన్స్ మరింత పెరుగుతాయని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో చిక్కులు తొలగిపోవడంతో రికార్డ్ కలెక్షన్స్ వస్తాయని చెబుతున్నారు.

    English summary
    It seems that the political chaos around Cameraman Ganga Tho Rambabu did not effect its collections. According to the reports of NDTV, CGR has collected around 52 crores world wide in its opening weekend. The film which was released on October 18 opened with tremendous collections.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more