ప్రభుదేవా ఆమెతో మందు కొట్టించాడా?
డాన్స్ మాస్టర్ నుంచి దర్శకుడిగా టర్న్ అయిన ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్టులతో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుదేవాపై ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇటీవల తాను రూపొందించిన 'రౌడీ రాథోడ్' చిత్రంలో నటించిన హీరోయిన్ సోనాక్షి సిన్హాతో ప్రభుదేవా తాజాగా 'ఓ మైగాడ్' అనే చిత్రం చేస్తున్నాడు.
ఈ చిత్రంలో 'గో గో గోవిందా' అనే సాంగు చిత్రీకరణ కోసం ప్రభుదేవా సోనాక్షితో మందు కొట్టించాడని, తాగిన మత్తు ఉండేలా ఎక్స్‌ప్రెషన్స్ సరిగా ఇవ్వక పోడంతో ప్రభుదేవా ఆమెతో నిజంగానే స్మాల్ పెగ్ వేయించాడని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలే ప్రభుదేవా డాన్స్ మాస్టర్. తన సినిమాల్లో దర్శకత్వం కంటే ముందే డాన్స్‌లపై దృష్టి పెడతారంతా. అందుకే ఆ పాట పర్‌ఫెక్ట్‌గా రావడానికి ప్రభుదేవా ఇలా చేశాడని అంటున్నారు. ఏది ఏమైనా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రభుదేవా ఇలాంటి పని చేయడం చర్చనీయాంశం అయింది.
ఇతర వివరాల్లోకి వెళితే...అవకాశాలు రాక పోయినా సరే బికినీలు, లిప్ లాక్ సీన్లు లాంటి వాటివి చేయనంటోంది దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ఇటీవల రౌడీ రాథోడ్ చిత్రంలో అనుష్క విక్రమార్కుడులో పోషించి పాత్రను పోషించి....బొడ్డు అందాల విషయంలో అనుష్కను మరిపించిన సోనాక్షి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











