రామోజీ రావు తనయుడు సుమన్ ‘నాన్ స్టాప్’గా!
ఈటీవీలో ఒకప్పుడు రోజుకి దాదాపు పద్నాలుగు గంటలు ఏదో ఒకలా దర్శనమిస్తుండే సుమన్ ఇప్పుడు తన దృష్టిని పెద్ద తెర మీదకు మళ్లించాడు. తొలి ప్రయత్నంగా 'ఉషా పరిణయం" అనే పౌరాణిక చిత్రం తీసి చేతులు కాల్చుకున్నాడు. బుల్లి తెర చిన్నెలు వెండి తెరపై ప్రదర్శిస్తే వాతలు తప్పవని గ్రహించాడో ఏమో ఇక కొత్త దారిని అన్వేషిస్తున్నాడు. ఈసారి 'నాన్ స్టాప్..కామెడీ" అనే పేరుతో ఒక చిత్రాన్ని నిర్మస్తున్నాడు. ఏడుపుగొట్టు కథలు, పౌరాణిక కహానీలు, ఆల్ రౌండ్ వంటలు ఇక్కడ చెల్లవని 'నాన్ స్టాప్" సినిమాకి వన్ మ్యాన్ షో ప్రదర్శిచలేదు. మరి సుమన్ బాబు నిజంగానే మారాడో, లేక 'నాన్ స్టాప్" గా అతని సృజనాత్మక దాడి వెండితెర మీద సాగనుందో తేలాలంటే ఈ సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.
రామోజీరావు సుమన్ నాన్ స్టాఫ్ ఉషా పరిణయం వన్ మ్యాన్ షో బుల్లితెర వెండితెర ramoji rao suman non stop usha parinayam one man show


Click it and Unblock the Notifications