For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిచా గంగోపాధ్యాయ బోయ్ ప్రెండ్ ఆత్మ హత్య ప్రయత్నం?(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : శేఖర్ కమ్ముల లీడర్ చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ కెరీర్ లో కిక్ లేకపోయినా, లవ్ ఎఫైర్ తో మీడియాలో మాత్రం హాట్ హాట్ గా నలుగుతోంది. తాజాగా ఆమె బోయ్ ప్రెండ్ ఆత్మ హత్యా ప్రయత్నం చేసాడంటూ వార్తలు వస్తున్నాయి. ప్రేమ చిక్కుల్లో చిక్కుకోవటం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన ప్రేయసి రిచా గంగోపాధ్యాయి తనతో వివాహానికి తిరస్కరించడంతో సుందర్‌రామ్ ఆత్మహత్యాయత్నం చేశాడని ఓ తమిళ పత్రిక వెల్లడించింది. ఈ వార్తల పట్ల రిచా తీవ్రంగా స్పందించింది. ఇవన్నీ ఒట్టి పుకార్లేనని, సుందర్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అయితే వీరిద్దరూ చాలా కాలం నుంచి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్తున్నారు. అసలు ఈ ప్రేమ కథ వ్యవహారమేమిటి అనేది పరిశీలిస్తే..

  బెంగాలీ భామ రిచాగంగోపాధ్యాయ ఓ తమిళ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్త చెన్నై సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘మయక్కమ్ ఎన్నా' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ తమిళ నటుడు సుందర్‌రామ్‌తో కలసి నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని ఓ తమిళ పత్రికలో కథనం వచ్చింది.

  ప్రేమ కానుకగా రిచా రూ.7 లక్షల కెమెరాను సుందర్‌కు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రిచా కుటుంబీకులు సుందర్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, రిచా చెన్నై వచ్చినప్పుడల్లా ఆమెను విమానాశ్రయంలో రిసీవ్‌ చేసుకుని హోటల్‌లో వదిలిపెట్టే వాడని సమాచారం. సుందర్‌ పెళ్లికి తొందరపెట్టడంతో గత కొన్ని నెలలుగా కలవడానికి రిచా నిరాకరించిందట. దీంతో రిచా ఇచ్చిన కెమెరాను సుందర్‌ పగలగొట్టాడని, పెళ్లికి నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సుందర్‌ బెదిరించినట్లు చెప్తున్నారు.

  తనతో పెళ్లికి రిచా గంగోపాధ్యాయ తిరస్కరించడంతో సుందర్‌రామ్ ఆత్మహత్యాయత్నం చేశాడని సదరు తమిళ పత్రిక వెల్లడించింది. ఈ విషయమై రిచా మాట్లాడుతూ ‘ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తారో అర్థం కాదు. సుందర్ నాకు మంచి మిత్రుడు. ఎంతో మంది సహనటుల్లో ఆయన ఒకరు. నా ప్రేమ వ్యవహారం గురించి వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా తమిళ, తెలుగు పరిక్షిశమల్లోరాణించడం పైనే వుంది. నిరాధార కథనాలతో నా మనసును బాధపెట్టొద్దు' అని చెప్పింది.

  రిచా మేనేజరు మాట్లాడుతూ.. రిచా ఎదుగుదలను అడ్డుకోవడానికి పన్నుతున్న కుట్ర ఇది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నందున పెళ్లి గురించి ఆలోచించట్లేదు. గత కొన్ని నెలల నుంచే వారి మధ్య మాటల్లేవు. అలాంటప్పుడు ఈ సంఘటనలు జరిగే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఈ వివాదంపై రిచా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.

  మరో ప్రక్క ఆమె కెరీర్ సైతం గొప్పగా లేదు. అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో' ఓ అమ్మాయిగా ముందు రిచా గంగోపాధ్యాయను తీసుకున్నారు. మళ్లీ ఏమైందో ఏమో ఆమెను తప్పించి తాప్సీని ఓకే చేశారు. అంతకు ముందు కూడా రిచా గంగోపాధ్యాయ వెంకటేష్ ‘షాడో' సినిమాలో హీరోయిన్ గా తొలుత రిచాను ఖరారు చేశారు. కానీ అనుకోకుండా ఆమె స్థానంలోకి తాప్సీ వచ్చిచేరింది. ఆ తర్వాత కార్తీ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బిర్యానీ' సినిమాలో కూడా రిచానే హీరోయిన్ అన్నారు. తర్వాత ఆమె స్థానంలో నీతూచంద్ర చేరిపోయింది. ఇవన్నీ ప్రతిష్టాత్మక చిత్రాలే కావడం గమనార్హం. వాటినుంచి రిచానే తప్పుకున్నారా? లేక తప్పించారా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘సార్ వచ్చారు', ‘భాయ్'చిత్రాల్లో నటిస్తోంది.

  English summary
  Richa Gangopadhyay has been reportedly dating photographer Sunder Ramu. Reportedly, they were in a live-in relationship at her flat in Mumbai. But it is now been said that her beau is forcing her to marry him and also threatened her of committing suicide if she does not tie the knot with him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X